పాలకొల్లు: డిసెంబర్,12(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఛాంబర్స్ కళాశాలలో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ప్రాంగణ ఎంపికలు జరిగాయి. నిర్మాణ్ సంస్థ ఆధ్వర్యంలో పలు కంపెనీలు తమకు కావలసిన ఉద్యోగులను వివిధ పరీక్షల ద్వారా ఎంపిక చేసుకున్నాయి. దాదాపు 214 మంది ఆఫర్ లెటర్లు సీఈఓ సందీప్ చేతుల మీదుగా అందుకున్నారు. వీరికి 20 వేల రూపాయల నెలవారి వేతనం ప్రకటించారు. టి సి ఎల్, ఎం ఆర్ ఎఫ్, యోమా, బజ్ వర్క్స్, ముత్తూట్ ఫిన్ కార్ప్ వంటి తయారీ రంగం, సేవా రంగం, బ్యాంకింగ్, ఎలక్ట్రానిక్స్ చెందిన ఎనిమిది కంపెనీలు ప్రాంగణ ఎంపికలో పాల్గొన్నాయి. కళాశాల చైర్మన్ కె.వి.ఆర్ నరసింహారావు క్యాంపస్ ఎంపిక శిబిరాన్ని ప్రారంభించారు. మన దేశంలో ఉద్యోగాలు విరివిగా లభించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. సిలబస్, పరీక్షలు త్వరితగతిన పూర్తి చేసి, ఛాంబర్స్ కాలేజీ వారు ఉద్యోగాలు పొందటానికి అనువుగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నట్టు ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ కనుమూరి సీతారామరాజు, కార్యదర్శి కటారి నాగేంద్ర కుమార్, డాక్టర్ ఏబిఎస్ మూర్తి, ఎం సీతారామారావు, ట్రెజరర్ ప్రవీణ్ భాను, ప్లేస్మెంట్ అధికారులు, వివిధ కంపెనీల హెచ్ఆర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
