పాలకొల్లు డిసెంబర్ 17 తెలుగు న్యూస్ పవర్ ప్రపంచ ప్రఖ్యాత గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతి స్థానిక అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాలలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కళాశాల ప్రిన్సిపల్ టి రాజరాజేశ్వరి, గణిత పోటీల్లో పాల్గొనడం సృజనాత్మకత, సమస్య పరిష్కార నైపుణ్యం అలవాడతాయన్నారు. గణిత జ్ఞానం అందరికీ ఎంతో అవసరం అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు గణిత సుడోకో, మ్యాజిక్ స్క్వేర్ అనే అంశం మీద పజిల్స్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గణిత శాస్త్ర విభాగం అధ్యాపకులు కే శివకృష్ణ, రామలక్ష్మి విద్యార్థులు పాల్గొన్నారు.
