Telugu News Power

నేడే కల్యాణోత్సవాల ప్రారంభం

పాలకొల్లు:డిసెంబర్,19( తెలుగు న్యూస్ పవర్) ఉభయగోదావరి జిల్లాల గోవింద మాల కళ్యాణ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న, 33వ వార్షికోత్సవ కార్యక్రమాలు శనివారం ఉదయం ప్రారంభం కానున్నాయి. గణపతి హోమం ఉదయం 7 గంటలకు మొదలవుతుంది. వెంకటేశ్వర స్వామి కళ్యాణం సాయంత్రం 5గంటలకు ప్రారంభం కానుంది. తిరుమల తిరుపతి దేవస్థానం వారి కల్యాణోత్సవ విగ్రహాలతో స్వామివారి కళ్యాణం జరుపుతారు. ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులకు తిరుపతి లడ్డు ప్రసాదం అందజేయడానికి నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు స్థానిక పెనుమదం రోడ్లో గల ఆర్ఆర్ రైస్ మిల్ లేఔట్ లో జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు.

భక్తుల కోసం తిరుపతి లడ్డు ప్రసాదం