Telugu News Power

వైభవంగా సత్యదేవుని వ్రతం

సత్యదేవుని వ్రత విగ్రహాలు
సామూహిక సత్యనారాయణ మూర్తి వ్రతం చేస్తున్న దంపతులు

పాలకొల్లు:డిసెంబర్,21(తెలుగు న్యూస్ పవర్) ఉభయ గోదావరి జిల్లాల గోవింద మాల కళ్యాణోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సామూహిక సత్యనారాయణ వ్రతం అత్యంత వైభవంగా జరిగింది. వెయ్యి యాగాల పుణ్యఫలం తో సమానమైన సత్యదేవుని వ్రతం వందల మంది దంపతులతో కిక్కిరిసిపోయింది. నిర్వాహకుల అంచనాలకు అందని సంఖ్యలో భక్తులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి కావలసిన పూజా సామాగ్రి మొత్తం ఉచితంగా నిర్వాహకులు అందజేశారు. అన్నవరం సత్యనారాయణమూర్తి దేవస్థానం నుంచి వచ్చిన 11మంది పండితులు, సత్యనారాయణ వ్రతం, కథలు వాటి ఫలితాలు చెప్పి, భక్తులను భక్తిశ్రద్ధలతో పూజలు ఆచరింపజేశారు. ఈ కార్యక్రమాన్ని ఆధ్యంతం మాంటిసోరి పాఠశాల అధినేత కలిదిండి కృష్ణ వర్మ నడిపించారు. కమిటీ గురు స్వామి యాదంరెడ్డి సత్యం మాట్లాడుతూ, వచ్చే ఏడాది వేల సంఖ్యలో భక్తులు పాల్గొని, వారిని చిన్న తిరుపతి బస్సుల్లో ఉచిత యాత్ర జరిపించాలని తలపెట్టినట్టు వెల్లడించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో వేదిక స్థలదాత, ఆర్ఆర్ రైస్ మిల్ అధినేత, అచ్యుతరామరాజు, తటవర్తి కృష్ణమూర్తి ,మేడికొండ శ్రీనివాస్ చౌదరి, పెనుమాక రామ్మోహన్ రావు, బీరక ప్రసాద్, కటారి నాగేంద్ర కుమార్, డి టి డిసి బాబు, గాదంశెట్టి సతీష్, చెరుకూరి మురళి, కుంపట్ల నాగ శ్రీనివాస్, గంధం ఆదినారాయణ, తదితరులు సహాయ సహకారాలు అందించారు. లీల భావనారాయణ, కొత్తపల్లి వెంకటరమణ, షామియానా, మండల రజిని రథాలంకరణ, శీలం ఏసుబాబు టిప్ టాప్ సప్లై చేశారు. సత్యనారాయణ వ్రతం చేసిన దంపతులకు అన్నవరం ప్రసాదం అందజేశారు. పూజలో పాల్గొన్న భక్తులకు బాదంపాలు పంచారు. అనంతరం జరిగిన మహాప్రసాద అన్నదాన వితరణ కార్యక్రమంలో వేలమంది ప్రసాదం స్వీకరించారు. భక్తులు వ్రతమాచరించడానికి అర్చక స్వాములు చెప్పేది చివరి వరకూ అందరికీ వినబడలేదనీ, తగినంత స్థలము లేకపోవడం, పైన టెంట్ లేక ఎండలో కూర్చోవడం వల్ల కొంత ఇబ్బంది కలిగిందని భక్తులు అభిప్రాయపడ్డారు. గత ఏడాది కంటే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం వల్ల ఈ చిన్నపాటి సమస్య ఎదురయిందని కమిటీ వారు తెలిపారు.

మహా ప్రసాదం స్వీకరిస్తున్న భక్తులు