పాలకొల్లు:డిసెంబర్,22(తెలుగు న్యూస్ పవర్) శాస్త్ర,సాంకేతిక రంగాలతో పాటు,మనిషి జీవితం ప్రతినిత్యం గణితంతో ముడిపడి ఉందని గణిత శాఖ హెచ్ ఓ డి డాక్టర్ జి సాయి బాబా పేర్కొన్నారు. ప్రపంచ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా స్థానిక ఛాంబర్స్ కళాశాలలో సోమవారం గణిత దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ విద్యార్థులు గణితం పట్ల అవగాహన పెంచుకోవాలని కోరారు. తరువాత గణిత సమస్యలకు సమాధానాలు ఇచ్చారు. కళాశాల చైర్మన్ కారుమూరి నరసింహారావు మాట్లాడుతూ, ప్రముఖుల జీవిత చరిత్రలు విద్యార్థులకు స్పూర్తిగా నిలుస్తాయన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ,గణితంలో ప్రతిభావంతులైన విద్యార్థులు పోటీ పరీక్షల్లో నెగ్గుకు రాగలుగుతున్నారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు గణితంలో వివిధ రకాల పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. డాక్టర్ సాయి బాబా ను కళాశాల యాజమాన్యం సత్కరించింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ మూర్తి, ఎన్. సీతారామరావు, శివ ప్రసాద్ వర్మ, కే విజయకుమార్, భావన శ్రీ, జానకి రామయ్య, రవికుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.