Telugu News Power

నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ లో సాయికుమార్ ప్రతిభ

పాలకొల్లు: జనవరి, 2(తెలుగు న్యూస్ పవర్) నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్, డిసెంబర్,22- 28 వరకు జరిగింది. తెలంగాణ రాష్ట్రం, హైదరాబాదు, మల్లారెడ్డి యూనివర్సిటీ లో ఈ క్యాంపు నిర్వహించారు. స్థానిక అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాల విద్యార్థి క్యాంపులో పాల్గొని ప్రతిభ కనబరిచాడు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం తరుపున, ఎన్ ఎస్ ఎస్ విద్యార్థి సాయికుమార్ కళాశాలకు గుర్తింపు తీసుకువచ్చినందుకు కళాశాల ప్రిన్సిపాల్ టి రాజరాజేశ్వరి అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తి కొనసాగిస్తూ మరింత ఉన్నత స్థానానికి వెళ్ళాలని ఆకాంక్షించారు. ఈ క్యాంపులో సంస్కృతులు,భాష,అవగాహన చేసుకుని స్నేహం పెంపొందించుకోవాలని, సాంస్కృతిక మార్పిడి, సామాజిక అవగాహన, జాతీయ విలువలు నాయకత్వం నైపుణ్యాలు గురించి చర్చిస్తారు. సామాజిక, పరిశుభ్రత, స్వచ్ఛమైన మంచినీరు దళితుల అంశాలపై అవగాహన కల్పిస్తారు. ఇది విషయాలను ప్రతిపాదనపరిచిన సాయి, ప్రతిభ చిహ్నంగా ధృవ పత్రం అందజేశారు. ఈ అభినందన కార్యక్రమంలో టీ కృష్ణ కే భద్రాచలం బి వెంకట స్వామి రామకృష్ణ విజయలక్ష్మి అధ్యాపకులు పాల్గొన్నారు.