Telugu News Power

విద్యార్థులు చదువుతోపాటు ఉపాధి నైపుణ్యాలు నేర్చుకోవాలి – డాక్టర్ బాబ్జి

ప్రారంభోపన్యాసం చేస్తున్న డాక్టర్ బాబ్జి

పాలకొల్లు: జనవరి,5(తెలుగు న్యూస్ పవర్) ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు చదువుతో పాటు ఉపాధి అవకాశాలు గల నైపుణ్యాలు నేర్చుకోవాలని, ప్రముఖ వైద్యులు, విద్యావేత్త, డాక్టర్ త్సవటపల్లి సత్యనారాయణమూర్తి పిలుపునిచ్చారు. స్థానిక అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాలలో సోమవారం మైక్రో గ్రీన్ కల్చర్, మరియు ఫ్యాబ్రిక్ బ్యాగ్ మేకింగ్ నేర్చుకోవడానికి సర్టిఫికెట్ కోర్సు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ టి రాజరాజేశ్వరి అధ్యక్షత నిర్వహించారు. ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో మైక్రో గ్రీన్ వంటి మొక్కలు పెంపకం, ఆరోగ్యంతో పాటు ఆదాయ వనరుగా కూడా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ప్రిన్సిపల్ టి.రాజరాజేశ్వరి రాజేష్ మాట్లాడుతూ, ఈ సర్టిఫికెట్ కోర్స్ వల్ల విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు, ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందన్నారు. రిసోర్స్ పర్సన్ లు విజయలక్ష్మి, సుశీల, అరుణ, ప్లాస్టిక్ వల్ల కలిగే పర్యావరణ నష్టాల వివరించారు. విద్యార్థులు ఇంటి నుంచి ఉపాధి అవకాశాలు సృష్టించుకోవచ్చు అన్నారు. కుటీర పరిశ్రమగా అభివృద్ధి చేసుకునే అవకాశం. ఉందన్నారు ఈ కార్యక్రమంలో వృక్ష,జంతు,గణిత శాఖలు, మరియు సి ఓ డబ్లు వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ సర్టిఫికెట్ కోర్స్ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సిరిగినీడి రంగారావు, కారుమూరి రామలింగేశ్వర రావు,వైస్ ప్రిన్సిపల్ టి కృష్ణ,కే భద్రాచలం, డాక్టర్ వి యామిని, డాక్టర్ భూసి వెంకటస్వామి,డాక్టర్ సిహెచ్ ఉషారాణి, ఆఫీసర్ డాక్టర్ ఎం రామకృష్ణ డాక్టర్ విజయలక్ష్మి శ్రీనివాసరావు శిరీష శ్రీదేవి ఎం శిరీష కే రోహిత్ కుమార్ జోష్ణ హెప్ప్సీ రాణి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.