న్యూఢిల్లీ:జనవరి,5(తెలుగు న్యూస్ పవర్) మోరి ఫీల్డ్ లో ఇరుసుమండ వద్ద చోటు చేసుకున్న అడ్వాన్స్ డీప్ ఇండక్షన్ గ్యాస్ లీక్ సంఘటనను, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్,ఓఎన్జిసి విజయవంతంగా నియంత్రించినట్లు ప్రకటించింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఓఎన్జిసి పేర్కొంది. ప్రమాదం గుర్తించిన వెంటనే అత్యవసర చర్యలు చేపట్టి పరిస్థితిని సమర్థవంతంగా అదుపులోకి తీసుకువచ్చినట్టు ఓఎన్జిసి వెల్లడించింది. ఈ ఘటన సమయంలో సుమారు 600 మీటర్ల పరిధిలో, ముందస్తు భద్రతా చర్యలు చేపట్టినట్టు తెలిపింది. స్థానికుల రక్షణ దృష్టిలో పెట్టుకుని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. గ్యాస్ లీక్ నియంత్రణకు క్రైసిస్ మేనేజ్మెంట్ టీం, సీఎం టి మరియు రీజనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ టీం, ఆర్ సి ఎం టి లను రంగంలోకి దింపినట్టు తెలిపింది. ఈ విపత్తు నిర్వహణ, అగ్నిమాపక, సాంకేతిక నిపుణుల సమన్వయంతో పనిచేసి ప్రమాదాన్ని నివారించినట్టు తెలిపారు. పరిస్థితి పూర్తగా, అదుపులోకి వచ్చిన తర్వాత గ్యాస్ లీక్ కారణాలపై సమగ్ర దర్యాప్తు చేపడతామని ఓఎన్జిసి తెలుపుతుంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అదనపు భద్రతా చర్యలు అమలు చేస్తామని సంస్థ పేర్కొంది. ఓఎన్జిసి సీనియర్ మేనేజ్మెంట్ మొత్తం పరిస్థితిని పర్యవేక్షిస్తూ, సిబ్బంది భద్రతతోపాటు, పర్యావరణ పరిరక్షణకు ఓ ఎన్ జి సి కట్టుబడి ఉందని వెల్లడించారు.
