పాలకొల్లు: జనవరి,9(తెలుగు న్యూస్ పవర్) స్థానిక నియోజకవర్గ పరిధిలో సంక్రాంతి సంబరాలు శుక్రవారం నుంచి వేగం పుంజుకున్నాయి. స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జల వనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు ప్రారంభమయ్యాయి. స్థానిక శ్రీనివాస డీలక్స్ రోడ్లో జరిగిన ముగ్గుల పోటీల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పలువురు వక్తలు మాట్లాడుతూ, పండగ పేరుతో, దుర్ వ్యసనాలకు, పాల్పడకుండా, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారని తెలిపారు. పాలకొల్లు జరిగే, సంక్రాంతి సంబరాలకు కుటుంబ సమేతంగా తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. మహిళలు తమలో ఉన్న సృజనాత్మకతకు మెరుగులు పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి పె. పెచ్చెట్టి బాబు, పట్టణ అధ్యక్షులు, గండేటి వెంకటేశ్వరరావు, పొట్నూరి శ్రీనివాస్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కర్నేని రోజారమని గౌరు నాయుడు, కూటమి నాయకులు తులా రామలింగేశ్వరరావు,కె.ప్రసాద్, బందెల భాస్కరరావు తదితర నాయకులు పాల్గొన్నారు.
