పాలకొల్లు, ఫిబ్రవరి, 1(తెలుగు న్యూస్ పవర్) మహాత్మా గాంధీ 79 వ వర్ధంతి సందర్భంగా, స్థానిక భారత విద్యార్థి ఫెడరేషన్, పట్టణ కమిటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి క్రాంతి కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, మహాత్మా గాంధీ కులమతాలకు అతీతమైన నిజమైన భారతస్వాతంత్ర సమరయోధుడని క్రాంతి పేర్కొన్నారు. గాంధీని అంతం చేసిన గాడ్సేను కూడా దేశభక్తుడి చెప్పడం ప్రస్తుత కేంద్ర ప్రభుత్వానికి తగదన్నారు. విద్యార్థులు తమ హక్కుల కోసం పోరాటడమే కాకుండా, సమాజ సేవకు ముందుకు రావడం గొప్ప ఆదర్శ పరిణామమని ప్రశంసించారు. ఈ ఈ రక్తదాన శిబిరంలో 28 మంది దాతలు, ప్రాణదానం చేసే రక్తాన్ని ఇచ్చారు. స్థానిక, బ్రాడీపేట,ఆదిత్య జూనియర్ కాలేజీలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఆదిత్య కాలేజీ ఇంచార్జ్ వాసు బాబు, హెచ్ఎం,అయ్యప్ప ప్రారంభించారు. ఎస్ఎఫ్ఐ పట్టణ శాఖ అధ్యక్షులు స్వరూప్, కార్యదర్శి సాయి, మోహన్, రవి వర్మ తదితర సభ్యులు పాల్గొన్నారు.