పాలకొల్లు: ఫిబ్రవరి,17(తెలుగు న్యూస్ పవర్)
కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడంలోనే నిజమైన ఆనందం ఉన్నదని వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు తటవర్తి సుధాకరరావు పేర్కొన్నారు. కొత్త కుళాయి చెరువు వద్ద సభ్యులతో కలిసి,మంగళవారం స్థానిక క్లబ్ తరపున, పలువురికి సహాయం అందించారు. కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి షేక్ పీర్ సాహెబ్, ఉపాధ్యక్షుడు మానెం బసవరాజు, సలాది రామచంద్రరావు, కోశాధికారి పోతుల ఉమాశంకర్ రావు, సభ్యులు కటారి నాగేంద్ర కుమార్, చామా శ్రీనివాసరావు, మానెం ధనుంజయ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యలమంచిలి మండలం చింతదిబ్బకు చెందిన పేద వికలాంగుడు చెవ్వేటి ఆనందరావుకు తన భార్య వైద్యం నిమిత్తం 7 వేలు ఆర్థిక సహాయం అందించడం తో పాటు పాలకొల్లు పట్టణానికి చెందిన ఓలిపల్లి అప్పారావుకు 4 వేల విలువైన డైపర్స్, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వెలిగెట్ల లక్ష్మణరావు, షేక్ గయాసుద్దీన్ కుటుంబాలకు 8 వేల రూపాయల నిత్యావసరాలు అందించారు.
వాకర్స్ క్లబ్, పాలకొల్లు సహాయం.