యలమంచిలి: మార్చి,21(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రజలకు మేలు చేయడమే కూటమి ప్రభుత్వ విధానమని, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు, స్థానిక శాసన సభ్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. స్థానిక మండలంలో, రూ. 3.48’కోట్ల రూపాయల నిధులతో చేపట్టనున్న, 12 అభివృద్ధి పనులకు మంత్రి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి, గుంపర్రు లో జరిగిన సభలో మాట్లాడుతూ, గత ప్రభుత్వం ప్రజా వేదిక కూల్చడంతో విధ్వంస పాలన మొదలు పెట్టిందన్నారు. కూటమి ప్రభుత్వం, పింఛను 4 వేల రూపాయలు కు పెంచి, ప్రజలకు మేలు చేసే పాలన ప్రారంభించిందన్నారు. కూటమి పాలన వచ్చిన తరువాత మాత్రమే రాష్ట్రంలో అభివృద్ధి పునః ప్రారంభమైందన్నారు. అప్పుల భారము ఉన్న, ప్రజల సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ సందర్భంగా, మళ్లీ జగన్ ప్రభుత్వం రాకుండా చూడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జగన్ ప్రభుత్వం వస్తే, పరిస్థితులు, రక్తపాతంతో ఎంత భయానకంగా, ఉంటాయో వివరిస్తూ, రక్తపాతం సృష్టిస్తారని, బీభత్సరస ప్రధానంగా సాగిన మంత్రి ప్రసంగం, ప్రజలకు కళ్ళకు కట్టినట్టు వెల్లడించడంతో, సభకు హాజరైన వారు ఊపిరి బిగ బట్టి విన్నారు. మంత్రి కూటమి నాయకులతో కలిసి, మండలానికి మారుమూల ఉన్న చింతదిబ్బ, కాంబోట్లపాలెం, గుంపర్రు, లంకపాలెం గ్రామాలకు, రోడ్డు సౌకర్యం, కమ్యూనిటీ హాల్ నిర్మాణం, ఆసుపత్రి నిర్మాణం కోసం నీటిపారుదల శాఖ, ఎంపీ , జిల్లా పరిషత్ నిధులతో ఈ పనులు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షురాలు గంటా శ్రీ పద్మ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మామిడి శెట్టి పెద్దిరాజు, జడ్డు రాజేష్, అనిశెట్టి శ్రీనివాసరావు, ఆరమిల్లి రామ శ్రీనివాస్, రామ్ భద్ర రాజు, మాజీ జెడ్పిటిసి బోనం నాని, సర్పంచుల ఛాంబర్ మాజీ అధ్యక్షులు కడలి గోపాల
రావు, తాళ్ల నాగరాజు, పలువురు స్థానిక ప్రజా ప్రతినిధులు కూటమి నాయకులు పాల్గొన్నారు. వడివడిగా సాగిన ఈ శంకుస్థాపన కార్యక్రమంలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
గుంపర్రులో జరిగిన శంకుస్థాపన సభలో మాట్లాడుతున్న మంత్రి నిమ్మల

మంత్రి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న బాలలు