Telugu News Power

శ్రీ శ్రీ శ్రీ మావులమ్మకు రూ.1.80 లక్షల బంగారం కానుక.

భీమవరం: మార్చి, 21(తెలుగు న్యూస్ పవర్.కాం)పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేలుపు,ఆరాధ్య దైవం శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ, అమ్మవారి నిలువెత్తు సంపూర్ణ స్వర్ణమయం, స్వర్ణ నిధికి అండలూరు చెందిన చిలుకూరు రాంబాబు, కుసుమరాణి పుణ్య దంపతులు లక్ష ఎనభై వేల రూపాయల విలువ చేసే 12 గ్రాములు బంగారం విరాళంగా సమర్పించారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ ఆశీర్వచన పూజలు నిర్వహించినారు.దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్, బుద్ద మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం అందజేశారు ఆలయ చైర్మన్ బొండాడ నాగ భూషణం, రామాయణం శ్రీనివాస్,ఉడిశి మీనాక్షి, అతికెల ఆంజనేయ ప్రసాద్,గుసిడి నాగశిరీష,గొంతిన రమణ,యండ సత్యవతి,మిర్తిపాటి గుణేశ్వరరావు,పాపొలు ఏడుకొండలు ధరకర్తలు నుంచి అమ్మ అమ్మవారి ప్రసాదాలు, చిత్రపటం చిలుకూరి దంపతులు స్వీకరించారు.

మావుళ్ళమ్మకు బంగారం కానుక సమర్పిస్తున్న చిలుకూరి దంపతులు