బెంగళూరు/పాలకొల్లు: మార్చి,29(తెలుగు న్యూస్ పవర్. కామ్) శ్రీ పార్వతీ పరమేశ్వర దేవస్థానం ట్రస్ట్ బోర్డు,బెంగళూరు సభ్యునిగా పాలకొల్లుకు చెందిన, జిల్లా బిజెపి నాయకులు జక్కంపూడి లక్ష్మీ నరసింహ నాగేంద్ర కుమార్(కుమార్)
దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యునిగా నియమితులయ్యారు. ఈ మేరకు ట్రస్ట్ బోర్డు చైర్మన్ రావెళ్ల రామకృష్ణ నియామక ఉత్తర్వులు ఆదివారం అందజేశారు. ఆధ్యాత్మిక, కళ, రాజకీయ రంగాలతో పాటు వివిధ రంగాల్లో, బహుముఖంగా సేవలందిస్తున్నారు. ప్రజాక్షేత్రంలో అందరివాడుగా కుమార్, చిరపరిచితులు. అజాతశత్రువు గా అందరినీ గౌరవించే విశిష్ట వ్యక్తిత్వం కుమార్ సొంతం. వారు
విజయవాడ సౌత్ సెంట్రల్ రైల్వే డి ఆర్ యు సి సి సభ్యునిగా, పాలకొల్లు చాంబర్ ఆఫ్ కామర్స్ సహాయ కార్యదర్శిగా, ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ స్టేట్ జాయింట్ సెక్రెటరీ గా,
పాలకొల్లు చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ కన్స్ట్రక్షన్ కమిటీ చైర్మన్ గా,
భారతీయ జనతా పార్టీ పోడూరు మండలం ఇంచార్జ్ గా, యునైటెడ్ క్లబ్ ఫౌండర్ గా,మానవత క్షీరా రామ సేవాసమితి,
ధర్మ పరిరక్షణ సమితి, రోటరీ క్లబ్ ఆఫ్ పాలకొల్లు,
ఘంటసాల కళాపరిషత్ వంటి అనేక సంస్థల్లో ముఖ్య పదవులు వీరిని వరించాయి. వీరి సేవలకు గుర్తింపుగా, బెంగళూరుకు చెందిన ఆలయ ధర్మకర్తల మండలిలో సభ్యునిగా అవకాశం లభించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు, ఎంపీ పాక సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ సిహెచ్ సత్యనారాయణ మూర్తి, అల్లు వెంకట సత్యనారాయణ, పాలకొల్లు చాంబర్ అద్యక్షులు కారుమూరి నరసింహమూర్తి, అయినంపూడి శ్రీదేవి, నారిన తాతాజీ, కొల్లి కొండ ప్రసాద్, కెవి కృష్ణ వర్మ,మేడికొండ శ్రీనివాస్ చౌదరి, గాది వెంకన్న, సీరం ఆనంద్ కృష్ణ తదితరులు అభినందనలు తెలియజేశారు
శ్రీ పార్వతీ పరమేశ్వర ఆలయం, బెంగుళూరు, ధర్మకర్తగా జక్కంపూడి కుమార్.