
చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కృష్ణారావు చిత్రపటాలకు పాలాభిషేకం
అవనిగడ్డ: జూలై, 21( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక మండలి అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. రాష్ట్ర ప్రభుత్వం మండలి వెంకట కృష్ణారావు జయంతి వేడుకలు ఇకనుంచి ప్రతి ఏటా ఆగస్టు 4వ తేదీ అధికారికంగా ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంగా, మండలి అభిమానులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. అవనిగడ్డ వంతెన సెంటర్లో కృష్ణారావు విగ్రహానికి మంగళవారం పాలాభిషేకం చేశారు. ప్రధాన కూడలిలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కృష్ణారావు చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు. బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకొని ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. ప్రప్రధమ ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ, తెలుగు అధికార భాషా సంఘం ఏర్పాటు ద్వారా తెలుగు భాషాభివృద్ధికి కృష్ణారావు చేసిన కృషి, దివిసీమ ఉప్పెన అనంతరం శవసేన ఏర్పాటు చేసి వేలాది మృతుల సామూహిక అంత్యక్రియల నిర్వహణ, దివి సీమ పునర్నిర్మాణంలో కృష్ణారావు చేసిన అనితర సాధ్యమైన సేవలకు గుర్తింపుగా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం వారి జయంతి ప్రత్యేక అధికారికంగా రాష్ట్ర పండుగలా నిర్వహించాలని ప్రకటించటం శుభ పరిణామం అని తెలిపారు. కృష్ణారావు శత జయంతి వేడుకల ప్రారంభోత్సవం సందర్భంగా కృష్ణారావు పేరును అధికార భాషా సంఘానికి పెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా వారి జయంతి ప్రతి ఏటా అధికారికంగా చేయాలని ఉత్తర్వులు జారీ చేయడం దివిసీమకే గర్వకారణం అన్నారు.
మండలి వెంకట కృష్ణారావు శత జయంతి కమిటీ, గాంధీ క్షేత్రం కమిటీల ప్రతినిధులు, మండలి అభిమానుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేశ్వరరావు, జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్, టీడీపీ అవనిగడ్డ, మోపిదేవి మండల అధ్యక్షులు యాసం చిట్టిబాబు, నడకుదుటి జనార్ధనరావు, టీడీపీ క్లస్టర్ ఇంచార్జి బండే రాఘవ, టీడీపీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు మాచవరపు ఆదినారాయణ, ఏఎంసీ వైస్ చైర్మన్ రాజనాల వీరబాబు, డీసీ వైస్ చైర్మన్ బచ్చు రఘునాథ ప్రసాద్, పీఏసీఎస్ చైర్మన్లు మాదివాడ రత్నారావు, యలవర్తి రాజ నాగ మునేశ్వరరావు (చిన్నా), బళ్ళ సీతారాం ప్రసాద్, యర్రంశెట్టి సుబ్బారావు, శివాలయం చైర్మన్ ఘంటసాల కన్నయ్య, మాజీ ఎంపీపీలు బండే కనకదుర్గ, మోర్ల జయలక్ష్మి, వైస్ ఎంపీపీ లుక్కా పిచ్చియ్య, ఏఎంసీ డైరెక్టర్ పుప్పాల ఏసు, ఆసుపత్రి డైరెక్టర్ బచ్చు కృష్ణకుమారి, నీటి సంఘ అధ్యక్షులు రేపల్లె రవీంద్ర, దేవస్థానం డైరెక్టర్లు మత్తి శివపార్వతి, అన్నపరెడ్డి వెంకటేశ్వరమ్మ, నాయకులు మండలి శేషు, బచ్చు శ్రీహరి, సిద్ధినేని అశోక్ నాయుడు, మొగల్ మురాద్, డోకిపర్తి బాల కోటేశ్వరరావు, డేగల రాఘవ, గాంధీ క్షేత్రం ప్రధాన కార్యదర్శి మత్తి శ్రీనివాసరావు, దివిసీమ లలిత కళా సమితి ప్రధాన కార్యదర్శి కూనపరెడ్డి చంద్రశేఖర్, గాంధేయవాది గరికపాటి సీతారామయ్య, భోగాది శివ విష్ణువర్ధన్, గుడివాక శివరావు, రెడ్రౌతు కృష్ణబాబు, కూరాకుల శివప్రసాద్, జరుగు పోతురాజు, యలవర్తి ఆది, రేపల్లె కృష్ణమూర్తి, కోసూరు పూర్ణచంద్రరావు, మండలి రామ్మోహనరావు, బొప్పన కాశీ విశ్వేశ్వరరావు, పులిగడ్డ బాలు శ్రీనివాస్, యాసం శ్రీరాములు, బడే సుబ్బారావు, చెన్ను శివాజీ, ముళ్లపూడి శ్రీనివాసరావు, మొగల్ మురాద్ బేగ్, భోగాది బాలకృష్ణ, అడబాల వేణుగోపాలరావు, సోమిరెడ్డి, నారేపాలెం శంకరరావు, మాదివాడ రాము, సిద్ధాబత్తుని హరినాథబాబు, మైలా హరిబాబు, దాసరి శ్రీనివాసరావు, కొండవీటి పాండురంగారావు, గుగ్గిలం అనీల్, గుగ్గిలం గాయత్రి, మండలి వెంకటేశ్వరరావు, బాలమ్మ, గుడివాక నరహరి, బచ్చు ఆదినారాయణ, మెగావత్ గోపీ, పసి, వాహేదుల్లా తదితరులు పాల్గొన్నారు.