Telugu News Power

దేశంలోనే ప్రథమ స్థానం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ -ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దక్షతకు నిదర్శనం.

ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖామాత్యులు కొణిదల పవన్ కళ్యాణ్

న్యూఢిల్లీ/విజయవాడ:మార్చి, 31 (తెలుగు న్యూస్ పవర్.కామ్) రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మాత్యులు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ కృషితో పంచాయతీరాజ్ శాఖ వివిధ విభాగాల్లో 5 అవార్డులు దక్కించుకున్నాయి. గతంలో 24వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మెరుగైన పనితీరుతో 1వ స్థానానికి పంచాయతీరాజ్ శాఖ చేరుకోవడం ఆ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ దక్షతకు నిదర్శనమని విశ్లేషకులు చెబుతున్నారు. దీనదయాల్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్, నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ డాక్టర్ విజయ్ కుమార్ బెహరా, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారుఆంధ్రప్రదేశ్ పంచాయతీలకు జాతీయ స్థాయి పురస్కారాలు – ఐదు పంచాయతీలు ఎంపిక
విజయవాడ: కేంద్ర ప్రభుత్వానికి చెందిన పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ 2025 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్, మరియు నానాజీ దేశ్‌ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐదు పంచాయతీలు దక్కించుకున్నాయి.
కేంద్ర ఆర్థిక సలహాదారు డాక్టర్ బిజయ కుమార్ బెహెరా విడుదల చేసిన ప్రకటన ప్రకారం, రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన పంచాయతీలు తమ పనితీరుతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి.
వైఎస్సార్ జిల్లా,ఖాజీపేట్ మండలం ,చెమ్ములపల్లి గ్రామ పంచాయతీ,
పేదరిక నిర్మూలన, మెరుగైన జీవనోపాధి కల్పన, విభాగంలో
2వ స్థానం, ప్రకాశం జిల్లా,కొత్తపట్నం మండలం, గుండమల గ్రామ పంచాయతీ,
స్వయం సమృద్ధి మౌలిక వసతుల కల్పన విభాగం,3వ స్థానం, విశాఖపట్నం జిల్లా,నాతవరం మండలం, స్రుంగవరం గ్రామ పంచాయతీ,
సుపరిపాలన, విభాగంలో 1వ స్థానం,
తిరుపతి జిల్లా, శ్రీకాళహస్తి మండలం,బొక్కసం పాలెం గ్రామ పంచాయతీ,
స్నేహపూర్వక మహిళా పంచాయతీ, విభాగం,1వ స్థానం
చిత్తూరు జిల్లా,కుప్పం మండలం (బ్లాక్ పంచాయతీ),
ఉత్తమ బ్లాక్ పంచాయతీ విభాగం,3వ స్థానం లో నిలిచాయి. కొన్ని అవార్డులు ఇతర రాష్ట్రాలు/పంచాయతీలతో సంయుక్తంగా పంచుకున్నారు.
ప్రభుత్వానికి సూచనలు
ఈ పురస్కారాలను గెలుచుకున్న పంచాయతీల విజయాలను విస్తృతంగా ప్రచారం చేయాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అలాగే ఇతర పంచాయతీలు కూడా వీటిని ఆదర్శంగా తీసుకుని అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని సూచించింది.
ఈ అవార్డులు గ్రామీణాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీల కృషికి ప్రతీకగా నిలుస్తున్నాయి.