జనరల్ డెస్క్: మార్చి, 31(తెలుగు న్యూస్ పవర్.కామ్)
మే నెలలో ఎండల తీవ్రత వల్ల అంగన్వాడీలకు వేసవి సెలవులు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ, సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం దేశవ్యాప్తంగా ఉద్యమం నిర్వహించారు. ప్రీస్కూల్ పిల్లలను సెంటర్కు పంపించడానికి తల్లిదండ్రులు చెందుతున్నారన్నారు. ప్రీస్కూల్ పిల్లలు ఎండల తీవ్రత వల్ల అనారోగ్యానికి గురవుతారని భయం వ్యక్తం చేస్తున్నారన్నారు.. గర్భిణీ స్త్రీలు, బాలింతలు కూడా సెంటర్కు రాలేకపోతున్నారు. ఆ సమయంలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు మధ్యాహ్నం సమయంలో ఇంటికి వెళ్లే దారిలో వడదెబ్బకు గురై అనారోగ్యానికి లోనవుతున్నారు. మే నెల అంతా ప్రీస్కూల్ పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు టేక్ హోమ్ రేషన్ అందించి, అంగన్వాడీలకు మే నెల అంతా వేసవి సెలవులు అమలు చేయాలని కోరుతూ, దేశవ్యాప్తంగా అంగన్వాడి వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) ఆద్వర్యంలో ప్రాజెక్ట్ కేంద్రాల వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. దేశవ్యాప్తంగా లక్షల మంది ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
అంగన్వాడీలకు మే నెల వేసవి సెలవులు ఇవ్వాలి. -సిఐటియు ఆధ్వర్యంలో దేశవ్యాప్త డిమాండ్.
అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ప్రాజెక్టు కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తల ప్రదర్శన