Telugu News Power

బలహీన వర్గాల అభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేస్తా -మంత్రి నిమ్మల రామానాయుడు

పాలకొల్లు: ఏప్రిల్, 11 (తెలుగు న్యూస్ పవర్. కామ్) బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి, అభివృద్ధి కోసం కృషి చేస్తానని, స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా శనివారం అడబాల థియేటర్ సెంటర్లో జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ, మహిళాభ్యున్నతి కోసం, ఆనాడే బాలికల విద్యకు పాఠశాల ఏర్పాటు చేసిన తొలి గురువు మహాత్మ జ్యోతిరావు పూలే గొప్ప దార్శనికుడిని కొనియాడారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం పోరాడిన స్ఫూర్తి అనుసరణీయమన్నారు. ఎన్ని అవరోధాలు, అవమానాలు ఎదురైనా వెరవకుండా స్త్రీవిద్య కోసం, మహిళ సాధికారత కోసం తన సర్వశక్తులు ఒడ్డిన పూలే ఆదర్శ సతీమణి సావిత్రిబాయి పూలే మహిళలకు మార్గదర్శని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలకు చెందిన పార్టీగా గుర్తింపు పొందిందన్నారు. టిడిపి బీసీలకు 34 శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తే, జగన్ ప్రభుత్వం 24 శాతానికి తగ్గించి బీసీలకు ద్రోహం చేసిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో బీసీల అభ్యున్నతికి కృషి జరుగుతుందన్నారు. మంత్రి ఆధ్వర్యంలో పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక గాంధీ బొమ్మల సెంటర్లో గల పూలే విగ్రహానికి, మంత్రి నిమ్మల కూటమి నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో, కోడి విజయభాస్కర్, పెచ్చెట్టి బాబు, గండేటి వెంకటేశ్వరరావు, నేను గౌర్నాయుడు దంపతులను మామిడి శెట్టి పెద్దిరాజు,అంగర చిన్న, కడలి గోపాలరావు, బిట్ట లక్ష్మీనారాయణ తదితర బీసీ నాయకులను మంత్రి సత్కరించారు. మహిళలకు కుట్టు మిషన్లు, ఇస్త్రీ బండి, టిఫిన్ బండి, నడుపుకోవటానికి పలువురికి తోపుడు ఒళ్ళు ధర్మారావు ఫౌండేషన్ తరపున ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్రావు, పొట్నూరి శ్రీనివాస్, బోప్పన హరి కిషోర్, చిట్టూరి సీతారామాంజనేయులు, చిలుకూరి బాలాజీ, పీతల శ్రీనివాస్, తుమ్మేటి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్న మంత్రి నిమ్మ

జ్యోతిరావు పూలే జయంతి సభలో మాట్లాడుతున్న మంత్రి నిమ్మల