Telugu News Power

దాతృత్వానికి మంచి మనసు ఉండాలి. -మంత్రి నిమ్మల రామానాయుడు.

పోడూరు: ఏప్రిల్, 11(తెలుగు న్యూస్ పవర్. కామ్) డబ్బు చాలామంది వద్ద ఉంటుందని, అయితే దాతృత్వానికి మంచి మనసు ఉండాలని, స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర జలవణుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల 142 మంది 9వ తరగతి విద్యార్థులకు ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో, ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమం జిన్నూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, నూజివీడు సీడ్స్, కాంటినెంటల్ కాఫీ, చెట్టినాడ్ సిమెంట్ వంటి ప్రముఖ కంపెనీలు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులు సమాజ అభివృద్ధికి కేటాయించటం పట్ల, వారి సేవ గుణాన్ని మంత్రి ప్రశంసించారు. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు దూరాభారం వల్ల ఇబ్బంది లేకుండా ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం 9వ తరగతి విద్యార్థులకు మాత్రమే కల్పిస్తున్న ఈ పథకం భవిష్యత్తులో ఆరో తరగతి వరకు విస్తరించాలని ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపారు. నిరంతరం ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి మరో 15 ఏళ్ళు అధికారంలో ఉండేలా ఆశీర్వదించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. రెండో శనివారం అయినప్పటికీ సెలవు లేకుండా నిరంతరం ప్రజల సేవకు అంకితమై పని చేస్తున్నారన్నారు. తన వ్యక్తిగత స్వార్థం కోసం కాకుండా నియోజకవర్గ అభివృద్ధికే తనకున్న అన్ని అవకాశాలను వినియోగిస్తున్నారు. ఈ సందర్భంగా చెట్టినాడ్ సిమెంట్ కంపెనీ ఎండి ముత్తయ్య ఔదర్యాన్ని మంత్రి కొనియాడారు. కంపెనీ మార్కెటింగ్ జనరల్ మేనేజర్ రామలింగరాజు, డిప్యూటీ జనరల్ మేనేజర్ సాంబశివరావు ను సభలో మంత్రి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎం ఈ ఓ లు విజయకుమార్, సూర్యనారాయణ, ప్రధాన ఉపాధ్యాయురాలు సిహెచ్ శివజ్యోతి, సొసైటీ అధ్యక్షులు దేవుళ్ళ ప్రసాద్, నాది అధ్యక్షులు పాలవలస తులసి రావు, ఏఎంసీ ఉపాధ్యక్షులు దాసరి రత్నం రాజు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ పెనుమత్స రాంభద్ర రాజు, రుద్రరాజు రమేష్ రాజు, బిజెపి నాయకులు ఉన్నట్లు కపర్ది, యర్రంశెట్టి పద్మారావు, దేవుళ్ళ మోహన్, కుక్కల సత్యనారాయణ, సంకు సుబ్రమణ్యం, శ్రీరామ్, గోపాలకృష్ణ, యలకల శ్రీనివాస్, వేడంగి, జున్నూరుపాలెం విద్యార్థుల తల్లిదండ్రులు, కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

జిన్నూరులో విద్యార్థికి సైకిల్ పంపిణీ చేస్తున్న మంత్రి నిమ్మల, చెట్టినాడ్ కంపెనీ ప్రతినిధులు