Telugu News Power

ఇటు తిరుపతి అటు అరసవల్లి మధ్యలో హమ్ సఫర్ రైలు. -ఫలించిన కేంద్ర మంత్రి కృషి.

శ్రీకాకుళం: ఏప్రిల్, 11(తెలుగు న్యూస్ పవర్. కామ్) శ్రీకాకుళం వాసుల వజజ్రోత్సవ కల ఎట్టకేలకు నిజమైంది. పౌర విమానయాణ శాఖ కేంద్రమంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అవిరాళ కృషికి ఫలితం దక్కింది. గత 75 ఏళ్లుగా శ్రీకాకుళం వాసులు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోడానికి నేరుగా రైలు ప్రయాణం కల్పించాలని మొక్కుకుంటున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక, స్థానిక ఎంపీ రామ్మోహన్ నాయుడు ఈ కోరిక తీర్చడం కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. అనేకసార్లు సంబంధిత మంత్రి అశ్విని వైష్ణవ్, దక్షిణ మధ్య రైల్వే అధికారులతో చర్చలు, సంప్రదింపులు జరిపారు. ఎట్టకేలకు ఈనెల 13 నుంచి హంసఫర్ రైలు ఈ రెండు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల మధ్య నడవనుంది. అత్యంత ప్రాచీన,ప్రసిద్ధ సూర్య దేవాలయం ఉన్న అరసవల్లి నుంచి ప్రపంచ ప్రఖ్యాత తిరుమల తిరుపతి వెంకన్న సన్నిధికి భక్తులను హంసఫర్ రైలు అనుసంధానం చేస్తుంది. అందువల్ల ఆధ్యాత్మిక పర్యాటకం అభివృద్ధి చెందుతుందని రామ్మోహన్ నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రైలు(17439/40) ప్రతి ఆదివారం సాయంత్రం తిరుపతి నుండి బయలుదేరుతుంది. ప్రతి సోమవారం మధ్యాహ్నం శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. ఈ రైలు భక్తులకు కలువుగా ఉంటుందని వర్షం వ్యక్తం చేస్తున్నారు.