స్థానిక బి ఆర్ ఆర్ అండ్ జికేఆర్ ఛాంబర్స్ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి కళాశాల చైర్మన్ కెవిఆర్ నరసింహారావు, ముఖ్యఅతిథిగా హాజరై, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
సమానత్వం, సామాజిక న్యాయం, బడుగు బలహీన వర్గాల వారి హక్కుల కోసం ఆయన చేసిన పోరాటాన్ని , జ్ఞానం, హక్కులు,త కుల వివక్షకు వ్యతిరేకంగా స్ఫూర్తినిచ్చిన మహోన్నత వ్యక్తి జన్మదినం జరుపుకుంటున్నారన తెలిపారు అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగాన్ని రూపొందించడంలో ప్రధాన పాత్రను డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పోషించారని, ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఉన్నత విద్యను అభ్యసించి ఒక ఆర్థికవేత్తగా, సంఘసంస్కర్తగా, రాజకీయ వేత్తగా, రాజ్యాంగ రచించిన కమిటీకి నాయకత్వం తవహించిన ఒక గొప్ప వ్యక్తి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మహాశయుని ఆశయాలను స్ఫూర్తి గా నింపుకుని ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలు సాధించాలన్నారు.
కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, భారత తొలి న్యాయమూర్తిగా, రాజ్యాంగ పితామహుడుగా ,జాతీయ జెండాలో అశోక చక్రాన్ని ప్రతిపాదించిన వ్యక్తిగా , పలు విదేశీ భాషల పై పట్టు సాధించిన వ్యక్తిగా ఈ తరం బుద్దుడు గాను, నేటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయడంలో ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తిగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సేవలో యావత్ భారతవనికి మంచి పనులేనని, విద్యనే ఆయుధంగా చేసుకొని విద్య, ఐక్యత,క్రమశిక్షణ అనే నినాదాన్ని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ను ఆధారంగా నేటి యువత తమ లక్ష్యాలను నిర్దేశకాలకు అనుగుణంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమానికి కళాశాల సెక్రెటరీ కె.వి సీతారామరాజు, ట్రెజరర్ ఆర్ ప్రవీణ్ భాను, అకాడమిక్ అడ్వైజర్స్ డాక్టర్ ఎబిఎస్ మూర్తి , నందుల సీతారామరావు , జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కె బాబ్జి, కళాశాల, అధ్యాపకులు ఎన్ రవికుమార్, యు జానకిరామయ్య బి విజయలక్ష్మి, సత్యవేణి, రాధా మాధవి, రంజని, శైలజ, స్పందన, సిరిచందన తదితరులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
చాంబర్స్ కళాశాలలో ఘనంగా అంబేద్కర్ జయంతి.
అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్న కాలేజీ కమిటీ