Telugu News Power

అగ్నిమాపక వారోత్సవాల్లో అవగాహన కార్యక్రమం.

లో భాగంగా రక్షణ ప్రదర్శినిస్తున్న అగ్నిమాపక దళం

భీమవరం: ఏప్రిల్ 20 (తెలుగు న్యూస్ పవర్. కామ్) అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా కలెక్టర్ చదలవాడా నాగరాణి,భీమవరం హాస్పటల్ ప్రాంతంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆదివారం పాల్గొన్నారు. అగ్ని ప్రమాదాల పట్ల అప్రమతులతో వ్యవహరించాలని కలెక్టర్ కోరారు. అగ్నిప్రమాదాలు వేసవికాలంలో ఎక్కడైనా ఏ సమయంలోనైనా జరగవచ్చని, ఎందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పాఠశాలలో, ఆసుపత్రిలో, కార్యాలయాల్లో, హోటల్లలో, అగ్నిమాపక నియంత్రణ వ్యవస్థ తరచూ తనిఖీలు చేయాలని సూచించారు. పాలకొల్లు జిల్లా సహాయ అధికారి వై వి జానకిరామ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు.