Telugu News Power

దొడ్డిపట్ల రేవు పాట ఖరారు.

దొడ్డిపట్ల రేవులో ఫంటు
మండల పరిషత్ కార్యాలయంలో దొడ్డిపట్ల రేవు పాట నిర్వహిస్తున్న దృశ్యం

యలమంచిలి: ఏప్రిల్, 29(తెలుగు న్యూస్ పవర్. కామ్) దొడ్డిపట్ల-కనకాయలంక రేవు పాట బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ వినుకొండ ధనలక్ష్మి కుమార్ ఆధ్వర్యంలో, ఎంపీడీవో జెడివి ప్రసాద్ నిర్వహించారు. ఈ వేలం లో పాల్గొన్న చేగొండి వీర వెంకటరమణ అత్యధిక ధర చెల్లించడానికి టెండర్ వేశారు. ఈ వేలం ప్రకారం 11 నెలలకు గాను, రూ. 3.82 లక్షలు మండల పరిషత్ కు ఆదాయం వస్తుంది. గత నెళ్ళాలుగా ఈ ఫెర్రీ పాట వాయిదా పడుతూ వచ్చింది. రేపు పాట దారుని మార్చడానికి ప్రయత్నం చేయడం వల్ల ఈ జాప్యం జరిగినట్టు తెలిసింది.