
శ్రీకాకుళం: ఏప్రిల్, 29(తెలుగు న్యూస్ పవర్. కామ్)
శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి, ధర్మపురం గ్రామాలలో జరిగిన ఆసిరితల్లి ఉత్సవాలు బుధవారం ఘనంగా జరిగాయి.
ఈ ఉత్సవాలుపదేళ్లకు ఒకసారి అరసవల్లిలో, 85 ఏళ్ల తరువాత పొందూరు మండలం ధర్మపురం గ్రామాలలో జరిగాయి. ఈ ఆసిరితల్లి ఉత్సవాల్లో ఆధ్యాత్మిక వైభవం వెల్లివిరిసింది. నేటి సమాజానికి నాటి నాగరికతను గుర్తు చేసే అమ్మవారి చల్లదనం, సిరిమాను ఉత్సవాలు జరుపుకోవడం ఒక బాధ్యతగా, గౌరవంగా భక్తులు భావిస్తారు.
ఈ వేడుకల్లో విశేషంగా భక్తులు, కేంద్ర పౌర విమానయాన శాఖామాత్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ , కూటమి శ్రేణులు పాల్గొని అమ్మవారి అనుగ్రహ దర్శనానికి పాత్రులు అయ్యారు.
