Telugu News Power

డిగ్రీ 1వ సెమిస్టర్ ఫలితాలలో ఛాంబర్స్ విద్యార్థుల ప్రభంజనం.

పాలకొల్లు: ఏప్రిల్, 30(తెలుగు న్యూస్ పవర్. కామ్)ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం విడుదల చేసిన 1వ సెమిస్టర్ ఫలితాల్లో చాంబర్స్ డిగ్రీ కళాశాల విద్యార్థులు 80శాతం ఉత్తీర్ణత సాధించారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.వెంకటేశ్వరరావు గురువారం తెలిపారు.
నన్నయ విశ్వవిద్యాలయం పరిధిలో ఉత్తమ ఫలితాలు సాధనలో ఛాంబర్స్ కళాశాల మొదటి స్థానంలో నిలిచిదంన్నారు.
విద్యార్థులు 9.2 నుంచి 9.8 మధ్యలో గ్రేడ్ పాయింట్స్ సాధించిన వారు 46మంది.
కళాశాలలో అత్యుత్తమ బోధన , ప్రమాణాలు కొనసాగిస్తూ ఆధునిక సాంకేతిక విధానాలలో విద్యార్థులను తీర్చుదిద్దుటలోనూ నూతన విద్యా విధానం -2020 సక్రమంగా నిర్వహించుటలోనూ కళాశాల ముందంజలో ఉందని చైర్మన్ కెవిఆర్ నరసింహారావు తెలిపారు.
ఈ సందర్భంగా ఉత్తమ గ్రేడ్ పాయింట్స్ సాధించిన విద్యార్థులను కళాశాల చైర్మన్ కె.వి.ఆర్ నరసింహారావు, సెక్రెటరీ కె.వి సీతారామరాజు, అకాడమిక్ అడ్వైజర్స్ ఏబీఎన్ మూర్తి , నందుల సీతారామరావు, ప్రిన్సిపాల్ డాక్టర్.డి.వెంకటేశ్వరరావు, అధ్యాపకులు అభినందించారు.
మంచి ఉత్తీర్ణతకు విద్యార్థులను తయారుచేసిన అధ్యాపకులను కళాశాల యాజమాన్యం మరియు ప్రిన్సిపాల్ కృతజ్ఞతలు తెలిపారు.