పాలకొల్లు: ఏప్రిల్,30(తెలుగు న్యూస్ పవర్. కామ్)స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ స్వయంప్రతిపత్తి కళాశాలలో, గురువారం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి. రాజరాజేశ్వరి పదవీ విరమణ కార్యక్రమం అధ్యాపకులు, విద్యార్థులు, కుటుంబ సభ్యులు, పూర్వ విద్యార్థుల సంఘటితమై ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైస్ ప్రిన్సిపల్ టి. కృష్ణ అధ్యక్షత వహించారు.
అధ్యక్ష ప్రసంగంలో వైస్ ప్రిన్సిపల్ టి. కృష్ణ మాట్లాడుతూ, డాక్టర్ రాజరాజేశ్వరి నాయకత్వంలో కళాశాల అభివృద్ధి పథంలో ముందుకు సాగిందని, ఆమె క్రమశిక్షణ, కృషి, విద్యార్థుల పట్ల ఉన్న నిబద్ధత ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. ఆమె సేవలు కళాశాల చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతాయని పేర్కొన్నారు.
ముఖ్య అతిథిగా హాజరైన రాజమహేంద్రవరం ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్ర ఎస్.కే.వి., డాక్టర్ రాజరాజేశ్వరి విద్యా సేవలు విశేషమని, విద్యార్థుల అభివృద్ధికి ఆమె చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.
ఎస్‌కేవీటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ తిరుపాండ్యం మాట్లాడుతూ, ఆమె పరిపాలనా నైపుణ్యం, క్రమశిక్షణతో కళాశాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లారని ప్రశంసించారు..
కొత్తపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె. పెద్దిరాజు మాట్లాడుతూ, డాక్టర్ రాజరాజేశ్వరి నాయకత్వం స్ఫూర్తిదాయకమని, విద్యా రంగానికి ఆమె చేసిన సేవలు ఎంతో గొప్పవని కొనియాడారు.
పూర్వ విద్యార్థి సంఘం అధ్యక్షుడు డాక్టర్ సంగినీడి.వి. రంగారావు మాట్లాడుతూ, తమలాంటి అనేక మంది విద్యార్థులకు ఆమె మార్గదర్శకురాలని, వారి జీవితాల్లో స్ఫూర్తి నింపిన గురువని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిడిసి సభ్యులు, పూర్వ విద్యార్థి సంఘం సభ్యులు, ప్రిన్సిపల్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పలువురు వక్తలు డాక్టర్ రాజరాజేశ్వరి గారి సేవలను ప్రశంసిస్తూ, ఆమె భవిష్యత్తు జీవితానికి శుభాకాంక్షలు తెలిపారు.అంతేకాక, తెలుగు విభాగాధిపతి డాక్టర్ బూసి వెంకటస్వామి గారు, ప్రిన్సిపల్ డాక్టర్ తిరువీధుల రాజరాజేశ్వరి గారి సేవలను వర్ణిస్తూ ప్రశంసాపత్రాన్ని రచించి, కళాశాల సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థుల తరఫున అందజేశారు. ఈ కార్యక్రమం లో వైస్ ప్రిన్సిపల్ టి కృష్ణ, కన్వీనర్ మరియు తెలుగు విభాగాధిపతి డాక్టర్ బూసి వెంకటస్వామి,కోకన్వీనర్ డాక్టర్ ఎం రామకృష్ణ, అర్థశాస్త్ర అధ్యాపకులు డాక్టర్ సిహెచ్ ఉషారాణి,డాక్టర్ వి విజయలక్ష్మి కళాశాలకు చెందిన అధ్యాపకులు ఇతర కళాశాలల కు చెందిన అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆత్మీయ వాతావరణంలో సాగిన, ఈ కార్యక్రమంలో పలువురు భావోద్వేగాన్ని వ్యక్తం చేశారు.
