Skip to main content

Telugu News Power

శ్రీ మావుళ్ళమ్మ వారి నిత్యాన్నదానానికి లక్ష రూపాయల విరాళం.

శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి విరాళం సమర్పించిన భక్త దంపతులు

భీమవరం: ఏప్రిల్, 4(తెలుగు న్యూస్ పవర్. కామ్)
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేలుపు ఆరాధ్య దైవం, శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి నిత్యాన్నప్రసాద వితరణ కు భీమవరం, చినఅమిరం కు చెందిన భక్తులు,కోరాడ శ్రీనివాస్ కీర్తి దంపతులు ఒక లక్ష నూట పదహారు రూపాయల విరాళం సమర్పించారు. వీరికి ఆలయ అర్చకులు ఆశీర్వచన పూజలు నిర్వహించారు. దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం, ఆలయ ధర్మకర్త రామాయణం శ్రీనివాస్, వుదీసి మీనాక్షి, అతికెల ఆంజనేయ ప్రసాద్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందచేసినారు.