
జనరల్ డస్క్: ఏప్రిల్, 4(తెలుగు న్యూస్ పవర్. కామ్)ఈ భూమి మీద పడ్డ ప్రతి జీవికి, పరమార్థం నిర్దేశించి పంపుతాడు దేవుడు. దైవం కూడా మానవుడిలా అప్పుడప్పుడు, తప్పులు చేయడం సహజంమేనేమో! ఆ తప్పును దిద్దుకోవటానికి, మరో రూపంలో శక్తియుక్తులు ప్రసాదించటం కూడా విధి లీల. అలాంటి, వరం అందుకున్న, అన్నమనీడి దైవ వెంకట సత్యనారాయణ కథే ఇది. చూపులకు ఎక్కడ కనపడని లోపం, మనసు నిండా వజ్ర సంకల్పం, గుండె నిండా నింపుకొన్న ధైర్యం ఉన్న అతనిని, ఉత్సాహంగా సాహస యాత్రకు ప్రోత్సహించారు, దైవం మానసరోపణ అన్నట్టు అతని ఉపాధ్యాయులు. పెంటపాడు, పోస్ట్ బేసిక్ పాఠశాలలో, ప్రత్యేక అవసరాల విద్యార్థులకు సంబంధించిన పాఠశాలలో పదో తరగతి చదువుతున్నప్పుడు ఇతని ప్రతిభను ఉపాధ్యాయులు గుర్తించారు. ఉపాధ్యాయని సాయి స్వరూప, అమలాపురం లో జరిగిన ట్రెక్కింగ్ కార్యక్రమం ఎంపికకు సత్యనారాయణ తీసుకువెళ్లారు. అక్కడ నుంచి అతని ప్రస్థానం అప్రతిహతంగా సాగింది. పలుచోట్ల ట్రెక్కింగ్
సంబంధించి శిక్షణ ఇచ్చారు. అనంతరం నేపాల్ లో గల ఎవరెస్టు శిఖరం బేస్ క్యాంప్ అధిరోహించటానికి ఎంపికయ్యాడు. రాష్ట్రం నుంచి 25 మంది ఎంపిక కాగా పశ్చిమగోదావరి జిల్లా నుంచి సత్యనారాయణ ఒక్కడే ప్రాతినిధ్యం వహించాడు. ఇతని తల్లిదండ్రులు శివాజీ, దేవి ధైర్యంగా తమ బిడ్డను ఈ సాహస యాత్రకు పంపించారు. సర్వ శిక్ష అభియాన్ ద్వారా సత్యనారాయణ ఈ సాహస యాత్రకు పంపినట్టు ప్రధాన ఉపాధ్యాయురాలు దండు పద్మ తెలిపారు. విద్యార్థి విజయం వెనక ఉపాధ్యాయుల కృషి ఎనలేనిది. ఇంతకీ ఈ బాలుడు మూగవాడు. ఇతని సాహసాన్ని చూసి, తన ఒడి చేరిన బాలుడ్ని హిమశిఖరం శిరస్సు వంచి ముద్దాడి మురిసి పోయింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వత ప్రాంతాల్లో ఒకటైన ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను ఒక చెవిటి (వినికిడి లోపం ఉన్న) బాలుడు అధిరోహించడం విశేషంగా నిలిచింది. ప్రతికూల పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొంటూ అతను సాధించిన ఈ ఘనత ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది.
ఎవరెస్ట్ బేస్ క్యాంప్ సముద్ర మట్టానికి సుమారు 5,364 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇంత ఎత్తుకు చేరడం అనేది సాధారణ వ్యక్తులకు కూడా కష్టమైన పని. అలాంటి సాహసాన్ని ఒక ప్రత్యేక అవసరాలు కలిగిన బాలుడు పూర్తి చేయడం అతని సంకల్పబలాన్ని సూచిస్తుంది.
కఠినమైన శిక్షణ – అచంచల నిబద్ధత
ఈ సాహస యాత్రకు ముందు బాలుడు కఠినమైన శిక్షణ పొందినట్లు . అధిక ఎత్తులో శ్వాస సమస్యలు, చలి, ప్రమాదకర మార్గాలు వంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు శారీరకంగా మరియు మానసికంగా సిద్ధమయ్యాడు. ఇలాంటి యాత్రలకు ముందుగా ప్రత్యేక శిక్షణ అవసరం.ప్రతిబంధకాలు ఉన్నా తన లక్ష్యాన్ని వదలకుండా ముందుకు సాగాడు. ఎత్తైన ప్రాంతాల్లో ఆక్సిజన్ కొరత, కఠిన వాతావరణం, అలసట వంటి సమస్యలు ఉన్నా, అతను ఒక్క అడుగు వెనక్కి వేయలేదు. ఇలాంటి సాహస యాత్రలు ఎంతో ధైర్యం మరియు పట్టుదల అవసరం చేస్తాయని నిపుణులు అంటున్నారు.
ఈ విజయం కేవలం వ్యక్తిగత సాధన మాత్రమే కాదు, దివ్యాంగులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చెవిటి పర్వతారోహకులు కూడా ఎవరెస్ట్ వంటి శిఖరాలను అధిరోహిస్తూ కొత్త చరిత్రలు సృష్టిస్తున్నారు.
ప్రభుత్వం – సమాజం ప్రశంసలు
ఈ ఘనతపై పలువురు ప్రముఖులు, క్రీడా నిపుణులు, సామాజిక సంస్థలు అభినందనలు తెలిపారు. దివ్యాంగులలో ఆత్మవిశ్వాసాన్ని పెంచే దిశగా ఇలాంటి విజయాలు కీలకమని వారు అభిప్రాయపడ్డారు.
“శారీరక పరిమితులు మనల్ని ఆపలేవు” అనే సందేశాన్ని ఈ బాలుడు తన విజయంతో ప్రపంచానికి తెలియజేశాడు. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ చేరిన అతని ప్రయాణం భవిష్యత్తులో మరెందరికో ప్రేరణగా నిలవడం ఖాయం. పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, విద్య శాఖ అధికారి నారాయణ, క్రీడల శాఖ అధికారులు సోమవారం కలెక్టరేట్లో సత్యనారాయణ ఘనంగా సత్కరించి అభినందనందించారు.
శుభాకాంక్షలు తెలియజేశారు. మట్టిలో మాణిక్యాలను, సైతం అసమాన దైర్య సాహసాలు వెలికి తీసి, మెరుగులు పెట్టే ఉపాధ్యాయ లోకానికి, ఈ సమాజం అభినందనలు తెలియజేస్తున్నది.