
పాలకొల్లు: మే,9 (తెలుగు న్యూస్ పవర్. కామ్) నా నియోజకవర్గమే, నా కుటుంబం అని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జల వనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. స్థానిక నియోజకవర్గంలో,
రూ. 8.25 కోట్ల 14అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల శనివారం శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా, గోరింటాడలో నిర్వహించిన శంకుస్థాపన సభలో మంత్రి నిమ్మల మాట్లాడుతూ, జిల్లా పరిషత్ చైర్మన్, ఎమ్మెల్సీ, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, జిల్లా కేంద్ర మార్కెటింగ్ సొసైటీ,టీటీడీ ట్రస్ట్ బోర్డ్ వంటి అత్యున్నత పదవులు పొందిన, నియోజకవర్గ వైఎస్ఆర్సిపి నాయకులు వాటిని అనుభవించారు తప్ప, పదవుల వల్ల ప్రజలకు ఏమాత్రం మేలు చెయ్యలేదని విమర్శించారు. గత ఐదేళ్ల వైసిపి పాలనలో, పడకేసిన అభివృద్ధిని, పట్టాలెక్కించి, ఈ 22 నెలల కాలంలో పరుగులు పెట్టిస్తున్నామని వెల్లడించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం, అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్నట్టు మంత్రి తెలిపారు. పని చేసే వారికి మాత్రమే ఓటు వేసి, ప్రభుత్వానికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ, నియోజకవర్గంలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వివరించారు. విద్యార్థుల కోసం వివిధ కంపెనీల సి ఎస్ ఆర్ నిధులతో సైకిల్ పంపిణీ కార్యక్రమం, రాష్ట్రంలో ఒక్క పాలకొల్లు నియోజకవర్గం లో మాత్రమే అమలు జరుగుతుందని తెలిపారు. ఈ విధంగా, అభివృద్ధి 15 ఏళ్ల పాటు జరగాలంటే, కూటమి అభ్యర్థులకే ఏ ఎన్నికల్లోనైనా విజయం చేకూర్చాలని కోరారు. స్థానిక పూలపల్లి, ఆగర్రు, వెలివెల, ఆగర్తిపాలెం, సగం చెరువు, గోరింటాడ గ్రామాల్లో, ఐ.ఆర్.ఆర్, ఆర్ డబ్ల్యు ఎస్, ఆర్ అండ్ బి నిధులతో పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు,ఏఎంసీ చైర్మన్ కోడి విజయభాస్కర్, మండల టిడిపి అధ్యక్షులు పాముల రజిని కుమార్, బిజెపి నాయకులు ఉన్నమట్ల కపర్తి, ఎర్రంశెట్టి పద్మారావు, ఎస్సీ సెల్ పీతల శ్రీనివాస్, మాజీ సొసైటీ అధ్యక్షుడు మండెల త్రిమూర్తులు, మాజీ సర్పంచ్ మండెల పావని, ఎంపిటిసి గెడ్డం కుటుంబరావు, మండెల మధుర మీనాక్షి, కావలి లక్ష్మీ, మామిడిశెట్టి లలిత, సాధనాల దుర్గబాబు, కలిదిండి రామచంద్ర రాజు వేగేసిన శ్రీహరి రాజు వాస మహేష్, గుబ్బల హరిప్రసాద్,
కలిదిండి శ్రీనివాసరాజు,కోటి రాంబాబు, తూమాల విజయకుమార్, దొమ్మేటి ఏసు,కందుల వెంకటేశ్వరరావు,నారాయణ శ్రీరెడ్డి బాబులు,కందిబోయిన నాగేశ్వరరావు లోకం సునీల్ బాబు, ప్రసాద్ సేలం అశోక్ కుమార్ కళ్యాణం శ్రీనివాస్ పులకడం వీర రాఘవులు చిరుమామిళ్ల రోహిణి రావు,ఇంటి శ్రీరాముడు, పోతుల సూరిబాబు రాయి ప్రసాద్ పెనుమత్స శ్రీనివాసరాజు జోగి బాలయ్య ఎల్లపు లోకేష్ నీలం నారాయణమూర్తి,స్థానిక నాయకులు పాల్గొన్నారు.