Skip to main content

Telugu News Power

జాతీయ, విదేశీ విద్యకు పావలా వడ్డీకే రుణాలు. -కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రకటన.

అమరావతి: మే, 8(తెలుగు న్యూస్ పవర్. కామ్) జాతీయ, విదేశీ విద్య అభ్యసించడానికి పావలా వడ్డీ రుణపథకం ప్రారంభించనున్నట్టు కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఏడాది ఐఐటి, ఎన్ఐటి, ఐ ఐ ఎం వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఈ ఏడాది సాధించిన 150-200 సీట్లు 500 లకు పెంచాలని కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు. ఇందుకు గాను, కలెక్టర్లు ప్రత్యేక కార్యాచరణతో పనిచేయాలని ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ అందించేందుకు ఏర్పాటు చేసుకోవాలన్నారు. విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చడానికి లక్ష్యాలు నిద్దేశించుకోవాలని సూచించారు.

పావలా వడ్డీ పథకం గురించి వివరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు