Telugu News Power

ఫలించిన మంత్రి మంత్రాంగం, శ్రామికుల సేవలో పార్టీ యంత్రాంగం.

బూరుగుపల్లిలో మజ్జిగ చలివేంద్రం నిర్వహిస్తున్న దృశ్యం

పాలకొల్లు: మే, 9(తెలుగు న్యూస్ పవర్. కామ్) మండే ఎండల్లో, పనిచేస్తున్న ఉపాధి హామీ శ్రామికులకు మజ్జిగ చలివేంద్రాలు వారి కార్యక్షేత్రాల్లోనే ఏర్పాటు చేయాలని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర జలవల శాఖామాత్యులు ఇచ్చిన పిలుపుమేరకు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు కార్యసాధనలో ముందుకురికాయి. వీరికి దాతలు సౌజన్యం అందజేస్తున్నారు. నియోజకవర్గంలోని పాలకొల్లు రూరల్, లంకల కోడేరు, తిల్లపూడి, పాలమూరు, బల్లిపాడు,వాలమర్రు, తదితర గ్రామాలు, యలమంచిలి మండలం, కంఛుస్తంభంపాలెం, బూరుగుపల్లి, మట్లపాలెం, లక్ష్మీ పాలెం, పోడూరు మండలం మట్టపర్రు వేడంగి, పాలెం, రావిపాడు గ్రామాల్లో శనివారం మజ్జిగ చలివేంద్రాలు నిర్వహించారు.