Skip to main content

Telugu News Power

పనిచేసే నాయకుడికి, ప్రభుత్వానికి ఇచ్చే మద్దతే అభివృద్ధి శ్రీరామరక్ష. -మంత్రి నిమ్మల రామానాయుడు.

బాడవ శంకుస్థాపన సభలో మాట్లాడుతున్న మంత్రి నిమ్మల

యలమంచిలి:మే, 10(తెలుగు న్యూస్ పవర్. కామ్) పనిచేసే నాయకుడికి, ప్రభుత్వానికి ఇచ్చే మద్దతు అభివృద్ధికి శ్రీరామరక్షని స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. మండలంలోని, అడవి పాలెం, కొంతేరు, కాజ పడమర, చించినాడ, కలగంపూడి, బాడవ గ్రామాల్లో రూ. 5.62 కోట్ల నిధులతో ప్రారంభించబోయే పలు అభివృద్ధి పనులకు మంత్రి ఆదివారం శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా, బడవలో జరిగిన శంకుస్థాపన సభలో మంత్రి మాట్లాడుతూ, అవిశ్రాంతంగా పని చేస్తున్న తనకంటే బాగా పని చేసే మంచి నాయకుడు వస్తే మద్దతు ఇవ్వవచ్చని, అందుకు తాను కూడా సహకరిస్తానన్నారు. ఎవరు వచ్చిన తనకు నియోజకవర్గ అభివృద్ధి ముఖ్యమన్నారు. రాష్ట్రం నలుమూలల తిరగవలసిన బాధ్యత, భారం మోస్తూనే, ఎప్పుడు సెలవు దొరికినా, నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం పాటు పడుతున్నానన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో చేసిన సేవలు గుర్తు చేశారు. అర్ధరాత్రి అయినా ప్రజలకు అందుబాటులో ఉంటున్నానన్నారు. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల వారి ప్రయోజనం కోసం కృషి చేస్తుందన్నారు. సమాజంలో ముఖ్యమైన రైతుల, కష్టాలు ఓ రైతుబిడ్డగా తనకు బాగా తెలుసునన్నారు. అందు కోసమే రైతులు తమ పొలాల్లోంచి పంటలను మార్కెట్కు తరలించే విధంగా రోడ్లు ఏర్పాటు ఆలోచన చేసినట్లు తెలిపారు. నియోజకవర్గాన్ని ఆంధ్ర రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిపేందుకు అహర్నిశలు పనిచేస్తున్నట్టు వెల్లడించారు. మండలంలో మంత్రికి అపూర్వ స్వాగతం లభించింది. ఈ కార్యక్రమంలో, మండల పరిషత్ అధ్యక్షురాలు వినుకొండ ధనలక్ష్మి రవికుమార్, నీటి సంఘం అధ్యక్షులు, మాత రత్నం రాజు, ఆరమిల్లి చిన్ని, సొసైటీ అధ్యక్షుడు బొప్పన హరి కిషోర్, రుద్రరాజు సత్యనారాయణ రాజు, బిజెపి నాయకులు ఉన్నమట్ల కపర్తి,మండల రైతు చెరుకూరి అంజిబాబు, మామిడి శెట్టి పెద్దిరాజు, నరసాపురం ఎండి డాక్టర్ ఇలపకుర్తి, బోనం నాని, చిట్టూరి రామాంజనేయులు, కడలి గోపి, కొలువు స్థానిక నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.