Telugu News Power

రొయ్యల మేత ధర పెంచలేదు ఆక్వా రైతు సంఘ స్పష్ఠీకరణ.

పత్రికా సమావేశంలో పాల్గొన్న ఆక్వా రైతు సంఘం ప్రతినిధులు

పాలకొల్లు: మే,16(తెలుగు న్యూస్ పవర్. కామ్) రొయ్యల మేత ధర పెంచలేదని,ఆక్వా రైతులు ఆందోళన చెందవద్దని
స్థానిక జై భారత్ క్షీర రామలింగేశ్వర ఆక్వా రైతు సంఘం సమావేశంలో అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు స్పష్టం చేశారు. మేత ధర విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. ఈ మేరకు శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. అప్సడా సమావేశం మంత్రి అచ్ఛెo నాయుడు హాజరు కాకపోవడం వల్ల ఏ నిర్ణయం తీసుకోకుండా ముగిసిందని వెల్లడించారు. ఎక్కడైనా ధరలు పెంచి అమ్మితే రైతులు సంఘాన్ని సంప్రదించాలని కోరారు. రొయ్యల ధర కేజీకి పాతిక నుంచి 30 రూపాయలు వరకు తగ్గించి ధర నిలకడ లేకుండా రైతులను ఆందోళనకు గురి చేస్తున్నారని సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. అమలాపురంలో రాష్ట్రస్థాయిలో జరుప తలపెట్టిన రొయ్యల రైతుల సమావేశంలో తగు నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు.ఈ సమావేశంలో మేడిది జాన్ డేవిడ్ రాజు, శ్రీహరి రాజు చంటి రాజు అంగర వరప్రసాద్
పి సత్యనారాయణ రాజు పాల్గొన్నారు.