
పాలకొల్లు: జూన్,8 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లాలో పాలకొల్లు, నర్సాపురం,మార్టేరు కూడలి ప్రాంతాల్లో ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం రొయ్యలు చేపల కూరతో అలగాలని చేసి మృగశిర కార్తికి ఆహ్వానం పలికారు. ఈ అన్నదాన కార్యక్రమంలో ప్రజలు ఆనందంగా విందు ఆరగించారు. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు మాట్లాడుతూ, దేశంలోనే ఈ తరహా వినూతన కార్యక్రమం మొట్టమొదటిసారి ప్రారంభించినట్టు తెలిపారు.
రొయ్యల దుకాణం ప్రారంభించిన మంత్రి నిమ్మల.
పూలపల్లి విద్యుత్ కేంద్రం దగ్గర రొయ్యల అమ్మకం కేంద్రాన్ని స్థానిక శాసనసభ్యు లు రాష్ట్ర జలవనుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మాంసం కంటే తక్కువ తలలో లభించే రొయ్యలు చేపల్లో మంచి పోషకాహారాలు లభిస్తాయి అని తెలిపారు. ప్రజలు ఆక్వా ఉత్పత్తుల వినియోగానికి అలవాటు పడాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ప్రోటీన్ తో కూడిన ఆహారం పదార్థం అందుతుందన్నారు. స్థానిక వినియోగం వల్ల ఆక్వా రైతులకు మార్కెట్
లభిస్తుందనన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్రావు, బోనం వెంకట నరసయ్య, మేడిది జాన్ డేవిడ్ రాజు, ఇంటి శ్రీరాముడు, ఆర్ సత్యనారాయణ రాజు, శ్రీనివాసరాజు, విజయ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.