నరసాపురం: మే, 16 (తెలుగు న్యూస్ పవర్. కామ్) కూటమి ప్రభుత్వ బంధుప్రీతి,ఆశ్రితపక్షపాతం వల్లే ఆక్వా రంగం సిండికేట్ల కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతుందని నర్సాపురం మాజీ ఎమ్మెల్యే, విప్, వైయస్సార్ పార్టీ జిల్లా అధ్యక్షులు, ఆక్వా రైతు నాయకుడు ముదునూరి ప్రసాద్ రాజు తీవ్రంగా ఆరోపించారు.కూటమి ప్రభుత్వం వచ్చాక వివిధ రంగాలు సంక్షోభంలో ఉండగా ఇప్పుడు ఆక్వారంగాన్ని కూడా సంక్షోభంపాలు చేస్తున్నారని ఆరోపించారు. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఆక్వా రంగం 10వ స్థానంలో ఉందన్నారు. రాష్ట్ర జి డి పి కి ఆయువుపట్టుగా ఆక్వా రంగం ఉందన్నారు. వ్యవసాయ రంగానికి ఇచ్చే ప్రోత్సాహకాలు ఏవి ఆక్వారంగానికి ఇవ్వడం లేదన్నారు. ఆక్వా రంగంలో ఒడిదుడుకులు సర్దుబాటు చేయటానికి, నాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్సడా చట్టం చేశారని గుర్తు చేశారు. ఆక్వారంగాన్ని ఆదుకోవడానికి 55 వేల విద్యుత్ కనెక్షన్లు ఇచ్చి, రూ. 3,800 కోట్లు సబ్సిడీ భరించినట్టు వెల్లడించారు, ఈ రెండేళ్ల సబ్సిడీ ఇవ్వలేదు సరి కదా. ఇప్పటివరకు ఒక్క కొత్త కలెక్షన్ కూడా ఇవ్వలేదనీ విమర్శించారు. ఆక్వా సిండికేట్ చేతుల్లో కీలుబొమ్మగా ప్రభుత్వం నడుస్తుంది తీవ్రంగా ఆరోపించారు. టన్నుకు పది పన్నెండు వేల రూపాయలు మేత ధర పెంచుతున్నట్టు కొత్తగా ఇన్వాయిసులు వస్తున్నాయ రైతుల ఆందోళన చెందుతున్నారు. ఆక్వారంగానికి సంబంధించి నిర్ణయాలు సమిష్టిగా తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి అప్సడా ఏర్పాటు చేశారని అయితే వారు అప్సడాను పట్టించుకోవటం లేదని ఆరోపించారు. ఆక్వా రంగానికి సమస్యలపై ఏర్పాటు చేసిన సమావేశానికి సంబంధిత మంత్రి అచ్చం నాయుడు హాజరు కాకపోవడం పట్ల వారి చిత్తశుద్ధి ఏపాటిదో తెలుస్తుందన్నారు. మేత సరఫరా లో కృత్రిమ కొరత సృష్టించి రైతులను రోడ్డుమీదకు లాక్కు వస్తున్నారని ఆరోపించారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండగా మూడుసార్లు పెంచిన ధరలు ప్రభుత్వం తగ్గించేసిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఎమ్మెల్యే వరకు ఎవరూ కూడా ఇంతవరకు ఆక్వా రైతులు పక్షాన కూటమి నాయకులు మాట్లాడిన పాపాన పోలేదన్నారు. ఓ పక్క మేత రేట్లు పెంచుతూ, మరోపక్క కేజీకి పాతిక రూపాయలు రొయ్య ధర తగ్గించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోహించారు. డాలర్ ధర పెరిగినప్పటికీ రొయ్య ధర పెంచడం లేదన్నారు.
రొయ్యల రైతులు హలో లక్ష్మణ అంటూ, తమ సమస్యను ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో కుమిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బంధు ప్రీతి వల్ల ఆక్వారంగం పై పడుతున్న భారాన్ని పట్టించుకోవడంలేదని, విమర్శించారు. కరోనా కాలంలో కూడా రేటు తగ్గించకుండా జగన్ ప్రభుత్వం రైతులను ఆదుకున్న అని తెలిపారు. నాలుగున్నర లక్షల ఎకరాల ఆక్వా రంగం ద్వారా ఏట 15 వేల కోట్ల రూపాయల
టర్న్ఓవర్ జరుగుతుందని వెల్లడించారు. ప్రధాన జీడీపీ ఆక్వారంగా ద్వారా 42 శాతం వస్తుందని పేర్కొన్నారు. ఇలాంటి రంగాన్ని ప్రోత్సహించవలసింది పోయి, సంక్షోభాన్ని సృష్టించడం సబబు కాదన్నారు. రొయ్యల రైతులు కేజీ ఉత్పత్తికి 350 రూపాయలు ఖర్చు చేస్తుంటే వారికి 250 రూపాయలు మాత్రమే ధర ఇస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆక్వా రైతుల సంక్షోహాన్ని నివారించకపోతే వైఎస్ఆర్ పార్టీ తరఫున ఉద్యమిస్తామని ప్రసాద రాజు హెచ్చరించారు.
ఆక్వా రంగ సంక్షోభానికి కూటమి ప్రభుత్వ బంధుప్రీతే కారణం. మాజీ ఎమ్మెల్యే ముదునూరి తీవ్ర ఆరోపణ.
నర్సాపురం వైసిపి పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతున్న ముదునూరి.