Telugu News Power

ఈనెల 20న మందుల షాపులు బంద్.

సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా అధ్యక్షులు తట్టవర్తి కృష్ణ మూర్తి

పాలకొల్లు: మే,16(తెలుగు న్యూస్ పవర్. కామ్) కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 20న దేశవ్యాప్తంగా జరిగే బందుకు ప్రజలు సహకరించాలని పశ్చిమగోదావరి జిల్లా సంఘ అధ్యక్షులు తట్టవర్తి కృష్ణమూర్తి విజ్ఞప్తి చేశారు. అసోసియేషన్ భవనంలో శనివారం జరిగిన సమావేశంలో ప్రతినిధులు మాట్లాడారు. మందుల షాపుల యజమానులు, సిబ్బంది ఈ ఆందోళన కార్యక్రమంలో తప్పక పాల్గొని, విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా బంద్ రోజు కొన్ని మందుల షాపులు తెరిచి ఉంచుతామని భరోసా ఇచ్చారు. ఆన్లైన్ వేదికగా నిర్వహిస్తున్న ఔషధ వ్యాపారంలో అనైతిక వ్యవహారాలు అడ్డుకోటానికి, అక్రమ డిస్కౌంట్లను నిరోధించటానికి ఈ బంద్ చేస్తున్నట్టు చేస్తున్నట్టు వివరించారు. కార్పొరేట్ కంపెనీలు ఆన్లైన్ వ్యాపారం ద్వారా జరిగిన నష్టం వల్ల సాంప్రదాయ పద్ధతుల్లో పని చేసే ఐదు కోట్ల మంది ఔషధ రంగంలో వారు ఉపాధి కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా కాలంలో ఇచ్చిన జీవో 22ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ప్రధానమంత్రికి ప్రాతినిధ్యం చేసినప్పటికీ ఏ విధమైన స్పందన లేదని ఆవేదవ వ్యక్తం చేశారు. బంద్ లోపు ప్రభుత్వం నిర్ణయం ప్రకటించకపోతే నిరవధిక ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. సమావేశంలో ఏ.చలపతిరావు, జివిఆర్ ఫణి తదితర సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.