Telugu News Power

కూటమి ప్రభుత్వం మానవత్వానికి ప్రతిరూపం.-మంత్రి నిమ్మల రామానాయుడు.

చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి నిమ్మల
సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందుకున్న లబ్ధిదారులు.

పాలకొల్లు: మే, 24 (తెలుగు న్యూస్ పవర్. కామ్)
పేద ప్రజలు అనారోగ్య కారణంగా ఆర్థిక సమస్యల్లో చిక్కుకుని, కుటుంబాలు కుదేలవకుండా కూటమి ప్రభుత్వం మానవత్వంతో వారికి సహాయం చేస్తుందని, స్థానిక శాసనసభ్యులు,రాష్ట్ర జల వనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. మంత్రి స్థానిక క్యాంపు కార్యాలయంలో, 106 మందికి రూ. 49.40 లక్షల విలువైన చెక్కులను ఆదివారం లబ్ధిదారులకు అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 20 నెలల కాలంలోనే, రూ.13.60 కోట్ల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వైద్య ఖర్చుల నిమిత్తం అందజేసినట్టు మంత్రి వెల్లడించారు. ఇది కేవలం ఒక్క పాలకొల్లు నియోజకవర్గం పరిధిలో మంజూరైన మొత్తమని వివరించారు. పేదల పక్షాన నిలిచి, వారి బాగోగుల పట్ల శ్రద్ధ వహించే కూటమి ప్రభుత్వానికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. గత వైఎస్ఆర్ పార్టీ రాక్షస పాలన అంతమైనప్పటికీ, ఇంకా రఫ్ఫా, రఫ్ఫా నరుకుతామని ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న వైసీపీ పార్టీని అన్ని ఎన్నికల్లో దూరం పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిడిపి కార్యదర్శి పెచ్చెట్టి బాబు, పట్టణ అధ్యక్షులు గండేటి వెంకటేశ్వరరావు, గొట్టుముక్కల సూర్యనారాయణ రాజు, బోనం నాని, బిజెపి నాయకులు ఉన్నమట్ల కపర్తి, సత్తినిది రాజా,పీతల, శ్రీనివాస్ ,బిట్ట లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.