నాడు 5 ఊళ్ళ కోసం కురుక్షేత్రం,
నేడు 5 సెంట్ల భూమి కోసం దాయాదుల పోరు.
భీమవరం: మే, 25 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రముఖ సినీ గేయ రచయిత చేగొండి అనంత శ్రీరామ్ సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు (పీజిఆర్ఎస్) తన తండ్రి , మాజీ ప్రిన్సిపల్ సి వి వి సత్యనారాయణమూర్తితో కలిసి వచ్చి ఫిర్యాదు చేశారు. యలమంచిలి మండలం దొడ్డిపట్లలో తమ ఇంటి వద్ద గల ఉమ్మడి స్థలాన్ని ఆక్రమించుకోవడానికి మాజీ ఎంపీ చేగొండి హరి రామ జోగయ్య కుమారుడు చేగొండి సూర్య ప్రకాష్ ప్రయత్నిస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వృద్ధులైన తమ తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని, వారికి రక్షణ కల్పించాలని అర్జీలో కోరారు. ప్రస్తుత వివాదాస్పద ఐదు సెంట్లు భూమి విషయం న్యాయస్థానం పరిధిలో ఉందని వివరించారు. తమ తల్లిదండ్రులను మానసిక క్షోభకు గురి చేస్తున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. అమెరికాలో ఉన్న తాను ఆందోళనతో హుటాహుటిన తరలివచ్చినట్టు అనంత శ్రీరామ్ వెల్లడించారు.