భీమవరం: మే, 28 (తెలుగు న్యూస్ పవర్. కామ్) భారత సైన్యానికి, మధ్యాహ్నం భోజనం లో రొయ్యలు ఆహారంగా ఇవ్వటానికి కృషి చేస్తానని, బీజేపీ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ తెలిపారు. రాజ్యసభ సభ్యులుగా ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా, పాలకొల్లుకు చెందిన బిజెపి నాయకులు ఉన్నమట్ల కపర్తి, కొల్లి కొండ ప్రసాద్, జక్కంపూడి కుమార్, వీరాజీ ఎంపీ ని కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా రొయ్యల రైతులు తమ సమస్యను ప్రస్తావించగా, మాంసం రేటు వెయ్యి రూపాయలు ఉన్నప్పటికీ, రొయ్యల రేటు రూ.300 కూడా లేకపోవడం పట్ల ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యసభలోను, మంత్రి నారా లోకేష్ తో ఈ విషయంపై చర్చిస్తానని హామీ ఇచ్చారు. తన ఏడాది కాలంలో కమ్యూనిటీ హాలు, కాలువల మరమ్మత్తులు, స్మశానాల సౌకర్యాలకు కోటిన్నర రూపాయల నిధులు వెచ్చించినట్టు వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి రాబోయే కాలంలో మరింత కృషి చేస్తానని భరోసా ఇచ్చారు