Telugu News Power

ఎన్టీఆర్ నంది పురస్కారం అందుకున్న మదీనా.

పాలకొల్లు: మే, 28 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక దగ్గులూరు కు చెందిన ఆల్ మదీనా మజీద్ అధ్యక్షులు హాజీ షేక్ ధరం మదీనా బుతవారం రాత్రి ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా జరిగిన పురస్కార ప్రధాన ఉత్సవాల్లో నంది అవార్డు అందుకున్నారు. మదీనా సాంఘిక సేవ, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి చేస్తున్న విశేష సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. హైదరాబాద్ యువ ఆర్ట్స్ థియేటర్స్ వారు త్యాగరాయ గ్రామ సభలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ పురస్కారం మదీనా స్వీకరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, హీరో సుమన్, సంస్థ అధ్యక్షులు కేతా శ్రీనివాసరావు, బి ఆర్ వెంకటరమణ తదితరులు ఈ పురస్కారాలు అనుజేశారు.