Skip to main content

Telugu News Power

విద్యుత్ కోసం ఆక్వా రైతులు విలవిల. 216 హైవే దిగ్బంధం.

యలమంచిలి: మే, 28 (తెలుగు న్యూస్ పవర్. కామ్) రోజున్నరపాటు చించినాడ ఇండస్ట్రియల్ ఫీడర్ కు విద్యుత్ సరఫరా నిలిచిపోవటంతో స్థానిక ఆక్వా రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చించినాడ వద్ద జాతీయ రహదారి దిగ్బంధించి గురువారం తమ నిరసన తెలియజేశారు. ఇప్పటికే ఎంతో పెట్టుబడి పెట్టి, వాతావరణ పరిస్థితులు అనుకూలించక ఆక్వా సాగు ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితుల్లో, విద్యుత్ సరఫరా నిలిచిపోవడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజిల్ పై నడపటానికి ఇబ్బందులు పడుతున్నామని, కానీ ఎక్కువమంది విద్యుత్ సరఫరా పైన ఆధారపడి రొయ్యల సాగు చేస్తున్నారని వివరించారు. విద్యుత్ సరఫరా తక్షణమే పునరుద్ధరించాలని ఆక్వా రైతులు నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో, మాజీ ఎంఈఓ ముదునూరి రంగరాజు, పాతపాటి ఆంజనేయరాజు, చిలుకూరు ప్రసాద్, ఉయ్యూరి శ్రీనివాసరాజు, కటారి మురళి, చరణ్, రుద్రరాజు శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.