పాలకొల్లు: మే,29 (తెలుగు న్యూస్ పవర్. కామ్) గడువుకు ముందే కాలువ లకు నీటిని విడుదల చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు రాష్ట్ర జలవనురుల శాఖామాత్యులు, స్థానిక శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు వెల్లడించారు. మంత్రి స్థానిక క్యాంపు కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ, పట్టణంలో ఒంటి పూట మంచినీరు సరఫరా ఎప్పటినుంచో ఉందన్నారు. కాలువలకు మరమ్మత్తులు చేయటం వల్ల కొంత తాత్కాలికంగా మంచినీటి సమస్య ఉత్పన్నమైనప్పటికీ, శాశ్వతంగా సాగునీరు, తాగునీరు నిరంతరం సరఫరా కావడానికి తప్పనిసరిగా కాలువలు కట్టి వేయటం జరుగుతుందన్నారు. గత వైసిపి ప్రభుత్వం విజ్జేశ్వరం ప్రాజెక్టు అటకెక్కించడంతో ఈ ఇబ్బంది ఎదురైందని అరోపించారు. పూర్తయి ఉంటే ఈ తాగునీటి సమస్య ఎదురయ్యేది కాదన్నారు .కూటమి ప్రభుత్వం 10 ఎం.ఎల్ నీటి సరఫరా సామర్థ్యం ఉన్న వ్యవస్థను, 11 ఎం ఎల్ నీటి సామర్థ్యంకి పెంచామన్నారు. ఇందుకోసం 15 కోట్ల రూపాయల వ్యయంతో రెండు ఓవర్హెడ్ ట్యాంకులు, ఫిల్టర్ బెడ్, సంపు, మంచినీటి పైప్లైన్ విస్తరణ జరిగిందన్నారు. తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం తెచ్చిన ప్రాజెక్టు వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల నిధులు మురిగిపోయాయని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.200 కోట్ల నిధులను మళ్ళీ మున్సిపల్ శాఖ మంత్రి చొరవతో అమలులోకి తెచ్చి పనులు ప్రారంభించినట్లు తెలిపారు ఈ ప్రాజెక్టు వల్ల పట్టణ ప్రజలకు రెండు పూటలా ఏట నీటి సరఫరా వీలవుతుందని వెల్లడించారు. 20 ఎకరాల మంచినీటి చెరువు 20 రోజులకు మాత్రమే నీటిని నిలువ చేయగల సామర్థ్యం ఉంటుందని తెలిపారు. అయినప్పటికీ అత్యంత జాగ్రత్తతో మంచినీళ్లు సరఫరా నిర్వహణ చేపట్టడం వల్ల ఇంతవరకు ప్రజలకు మంచినీరు సక్రమంగా అందించగలిగామన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొత్త కుళాయి చెరువు స్వయంగా పరిశీలించారు. ఈ సమావేశంలో, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, పెచ్చెట్టి బాబు, గండేటి వెంకటేశ్వరరావు, పొట్నూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
గడువు కు ముందే కాలువలకు నీరు విడుదల చేయాలని మంత్రి ఆదేశాలు. తీరనున్న మంచినీటి సమస్య.