Telugu News Power

సార్వాసాగుకు రైతులు సిద్ధపడాలి. -వ్యవసాయ అధికారుల సూచన

రైతులకు సూచనలు ఇస్తున్న వ్యవసాయ అధికారి మురళి కృష్ణ

పాలకొల్లు: జూన్,1(తెలుగు న్యూస్ పవర్. కామ్)
పాలకొల్లు నియోజకవర్గం లో కాలువలు జూన్ ఒకటో తారీఖున గోదావరి నీటి విడుదల చేస్తామని ప్రభుత్వం వారు తెలియజేశారు కావున రైతు సోదరులు అందరు కూడా జూన్ మొదటి వారంలో నారుమడలు వేయడానికి సిద్ధపడాల్సిందిగా కోరుచున్నాము ఖరీఫ్ లో వరి రకాలు ఎంటియు 1318 ఎం టి యు 7029 అలాగే 12:93, 12 82, 1140,సంపద స్వర్ణ,ఈ వెరైటీలు అన్నీ కూడా సాగుకు అనుకూలము రైతు సోదరులు సమాయత్తమయి నారుమడులకు ఎకరానికి ఐదు సెంట్లు నేలను సిద్ధం చేసుకోవాల్సిందిగా తెలియజేయుచున్నాము రైతులకు కావాల్సిన ఎరువులు అన్నీ కూడా సమృద్ధిగా ఉన్నాయి అలాగే నవధాన్యాలు సాగుచేసిన రైతులు పొలాల్లో ఈ నవధాన్యాలన్నీ కూడా వేపుగా పెరుగుతూ ఉన్నాయి ఒక ఎకరానికి రెండు టన్నుల వరకు రొట్ట పెరిగే అవకాశం ఉంది ఇవన్నీ కూడా సేంద్రీయ కర్బణం చెంది నేలకు బాగా బలం చేస్తాయి ఈరోజు కాపవరం వాలమర్రు దగ్గులూరు లంకలకోడేరు గ్రామాలు సందర్శించి రైతులకు నారుమడలు వేయడానికి సిద్ధపడాల్సిందిగా తెలియజేయడమైనది దీంట్లో మండల వ్యవసాయ అధికారి రాజశేఖర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ పి మురళీకృష్ణ అలాగే ఏపీ సీఆన్ అఫ్ అప్పారావు రైతు సోదరులు పాల్గొన్నారు