పాలకొల్లు: జూన్, 1 (తెలుగు న్యూస్ పవర్. కామ్) తరలిరాద తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం అన్నట్టుగా స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు స్వయంగా ఉపాధి శ్రామికుల వద్దకు స్వయంగా వెళ్లి సోమవారం వారికి మజ్జిగతో సేద తీర్చారు. స్థానిక వెలివెల గ్రామంలో పంట బోదులలో పని చేస్తున్న శ్రామికుల వద్దకు కాలువలో దిగి వెళ్లి శ్రామికులకు మజ్జిగ అందజేశారు. గత ఏడాది నుంచి పాలకొల్లు నియోజకవర్గంలో ఉపాధి హామీ శ్రామికులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం మంత్రి నిమ్మల ప్రారంభించారు. ఏడాది కూడా కొనసాగించవలసిందిగా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. మంత్రి ఉపాధి శ్రామికులతో మాట్లాడుతూ, ప్రతిరోజు మజ్జిగ అందుతుందా అని వారిని అడిగి తెలుసుకున్నారు. తమ దయవల్ల ప్రతిరోజు ఇస్తున్నారని శ్రామికులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా, మంత్రి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు.ఏ అవసరం వచ్చిన అండగా ఉండాలని శ్రామికులకు మంత్రి భరోసా ఇచ్చారు. శ్రామికుల మజ్జిగతో దాహార్తిని తీర్చడం తనకు సంతోషంగా ఉందని మంత్రి తెలిపారు.
ఉపాధి శ్రామికులకు మజ్జిగతో సేద తీర్చిన మంత్రి నిమ్మల.
శ్రామికులకు మజ్జిగ పంచుతున్న మంత్రి నిమ్మల