Telugu News Power

శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి స్వర్ణ మయ నిధి ప్రత్యేక సమావేశం.

భీమవరం: జూన్, 2 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక
శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం సంపూర్ణ స్వర్ణమయ నిధి ప్రత్యేక కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. స్వర్ణమయ ప్రాజెక్టులో భాగంగా ప్రస్తుతం దేవస్థానం వద్ద 23 కేజీల బంగారం సిద్దముగా ఉన్నట్లు తెలిపారు. భక్తుల నుంచి మరో 27 కేజీలు బంగారం కానుకలుగా స్వీకరించి మొత్తం 50 కేజీలతో వివిధ అలంకరణ వస్తువులు తయారుచేయుటకు ప్రతిపాదించారు. స్థానిక శాసనసభ్యులు, పి ఏ సి చైర్మన్ పులపర్తి రామాంజనేయులు ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ కాకినాడ డిప్యూటీ కమీషనర్ డి ఎల్ వి రమేష్ బాబూ, రాజమండ్రి జ్యువలరీ వెరిఫికేషన్ ఆఫీసర్ పల్లంరాజు, జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమీషనర్ హరి సూర్యప్రకాష్, దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్, స్వర్ణమయం కమిటీ సభ్యులు గుంట్ల వెంకటనారాయణ, రమేష్ అగర్వాల్..బొండాడ రామపండు, కాగిత వెంకటరమణ, సంగిడి బుజ్జి, బొండాడ నాగభూషణం దేవస్థానం ధర్మకర్తలు తదితరులు తో ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు. భక్తులు మనోభావాలు కు తగ్గట్టు గా స్వర్ణమయ ప్రాజెక్టు పనులు త్వరితముగా చేయడానికి అందరూ సహకరించాలని సమావేశం ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో దేవాదాయ శాఖ మంత్రి వర్యులు, అధికారులు అందరూ సహకారం అందించారు అని అందుకు ఎమ్మెల్యే అంజిబాబు కృతజ్ఞతలు తెలిపారు.
ఇప్పటికే శ్రీ అమ్మవారి అలంకరణలో ఉన్న దాదాపు 23½ కేజీల ఆభరణములు సమర్పించారు. ప్రభుత్వం వారు సంపూర్ణ స్వర్ణమయం నిమిత్తం ఏర్పాటు చేసిన కమిటీ దేవదాయ శాఖ కమిషనర్ వారు ఆదేశము, సూచనలు, సలహాలు మేరకు అలంకరణ ఆభరణాలపనులు పూర్తి చేయుటకు. తొలివిడతలో 20 కేజీలు తో బంగారు ఆభరణాలు చేయించడానికి ప్రయత్నం చేస్తున్నట్టు దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ తెలిపారు.