భీమవరం: జూన్, 2(తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 9న జిల్లాకు రానున్నారు. ఈ పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం అధికారితో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఆచంట నియోజకవర్గం సిద్ధాంతంలో సీఎం సభ నిర్వహించనున్నారు. పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి నిర్వహిస్తారు.
ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా గ్రామ సభ, ప్రజా సానుకూల స్పందనపై సమీక్ష, రైతులతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహిస్తారు. అన్ని శాఖల అధికారులు తాజా గణాంకాలతో సిద్ధంగా ఉండాలని సూచించారు.బహిరంగ సభ, హెలిపాడ్, పార్కింగ్, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లలో ఎటువంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
సీఎం రాకపై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం.
జిల్లా కలెక్టర్ల చదలవాడ నాగరాణి