Telugu News Power

దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం. 21 మంది సజీవ దహనం. మరో 10 మంది పరిస్థితి విషమం.

హోటల్ లో మంటలు అర్పిస్తున్న ఫైర్ సిబ్బంది
పోలీసులు అదుపులో హోటల్ యజమాని లౌకేష్ బజాజ్

న్యూఢిల్లీ: జూన్,3 (తెలుగు న్యూస్ పవర్. కామ్) దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో బుధవారం ఉదయం 9 గంటలకు హోటల్లో అగ్నిప్రమాదం సంభవించింది. దక్షిణ ఢిల్లీ మాల్వియా నగర్ లోని హౌస్ రాణీ యొక్క ఇరుకైన సందులో ఉన్న ఫ్లవర్స్ స్టే హోటల్లో ఎక్కిన ప్రమాదం జరిగింది. స్థానికులు చెప్పుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేశారు. ఈ హోటల్లో 40 మంది వరకు అతిధులు ఉన్నట్టు తెలుస్తుంది. ప్రమాదంలో వచ్చి కోపంలో వారిని ఆసుపత్రికి తరలించగా వారిలో 21 మంది మృతి చెందినట్లు అధికారిక ప్రకటన వెలువడింది. మరో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. అగ్నిమాపక దళం, పోలీసులు, స్థానికులు సహాయకు చర్యల్లో పాల్గొని బాధితులను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతులకు రెండు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. హోటల్త యజమాని లౌకేష్ బజాజ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హోటల్ పలు నిబంధనలను అతిక్రమించి నడుపుతున్నారు. ప్రభుత్వం నుంచి కేవలం 6 గదులు నిర్వహించడానికి మాత్రమే అనుమతి ఉంది. అయితే 20 కంటే ఎక్కువ గదులు నిర్వహిస్తున్నట్టు బయటపడింది. ఈ హోటల్ కు వెళ్లి రావడానికి ఒకటే మార్గం ఉంది. అగ్నిమాపక దళం వారి లైసెన్స్ కూడా లేదు. హోటల్ యాజమాన్యంపై దోషపూరిత నరహత్య కేసు పోలీసులు నమోదు చేశారు. బాధితులు మధ్యఆసియా, ఆఫ్రికా దేశాలకు చెందిన వారుగా గుర్తించారు. పక్కనే ఉన్న ఆసుపత్రిలో వైద్యసిగించ నిమిత్తం వారు ఈ హోటల్లో బస చేశారు. వైద్య సేవలతో ఆరోగ్యంగా ఇంటికి వెళ్లాలనుకున్న వారి కల, హోటల్ మంటల్లో కాలి బూడిదై వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం 21 నిండు ప్రాణాలను బలి తీసుకుంది. దేశ రాజధాని లో ఇలాంటి సంఘటన జరగటం పట్ల అంతర్జాతీయంగా దేశానికి, పర్యాటక రంగానికి ఎదురు దెబ్బ తగిలింది.