యలమంచిలి: జూన్, 14 (తెలుగు న్యూస్ పవర్. కామ్) గత వైసీపీ ప్రభుత్వ పాలనలో అభివృద్ధికి ఆనవాళ్లు కూడా లేవని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జల వనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు ఎద్దేవా చేశారు. స్థానిక మేడపాడు లో ఆదివారం రూ. 2.39 కోట్ల పనులకు కూటమి నాయకులతో కలిసి శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా,నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జరిగిన సభలో మంత్రి మాట్లాడారు. నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధిని పట్టించుకోకుండా తాడేపల్లి పాలస్ కే పరిమితమయ్యారని విమర్శించారు. గత ఐదేళ్లలో వైసిపి పాలన పరదాల చాటుమాటుగా సాగిందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన రెండేళ్ల కాలంలో ఒక్క మెడ పొడికి 20 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామన్నారు. జగన్ అర్థరహిత పాలన వల్ల ఆర్థిక పరిస్థితి వెఃటిలేటర్ పై పడేసిపోతే, విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి మోడీ ఆశీస్సులతో ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎమర్జెన్సీ వార్డుకు మళ్ళించగలిగామన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని, ఎమ్మెల్యేగా ఉన్న తనపై వైసీపీ ప్రభుత్వం దాడులకు తెగబడిందని ఆరోపించారు. ఈ పాలనతో విసుగుచ్చింది 11 సీట్లకు పరిమితం చేసిన వైసీపీ పార్టీ ప్రవర్తనలో ఈ విధమైన మార్పు లేదన్నారు. వచ్చే 2029 ఎన్నికల్లో మళ్లీ గెలిస్తే, గంగమ్మ జాతరలో గొర్రెలను అమ్మవారికి బలి ఇచ్చినట్టు రఫ్ఫా రఫ్ఫా నరుకుతామని ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. మరు భూమిని కూడా సుందరవరంగా తీర్చిదిద్దుతూ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని వైసీపీ నాయకులు అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. హింసాత్మక పాలనకు పాల్పడే పార్టీలకు ప్రజాస్వామ్యంలో అధికారం చేపట్టే అవకాశం లేదన్నారు. ప్రజలు ఇలాంటి వారిని అధికారంలోకి రాకుండా భూస్థాపితం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో, వైద్యులు అశ్విని, మండల టిడిపి అధ్యక్షులు మామిడిశెట్టి పెద్దిరాజు, చేగొండి రవిశంకర్,అడ్డాల రాజశేఖర్, పీతల శ్రీనివాస్, బిజెపి నాయకులు వీరాజీ, చల్లా నరేంద్ర కుమార్, బోనం నాని, కడలి గోపి, ఎంపీడీవో జేడివి ప్రసాద్, డి ఈ కే దుర్గా రామస్వామి, ఏ ఈ వివి రమణ, బి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
గత ప్రభుత్వంలో అభివృద్ధికి ఆనవాళ్లు ఎక్కడ? -మంత్రి నిమ్మల ఎద్దేవా
మేడపాడు ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభోత్సవ సభలో మాట్లాడుతున్న మంత్రి నిమ్మల