Telugu News Power

నమ్మకం సభలు విజయవంతం చేయాలి. -మంత్రి నిమ్మల పిలుపు

పాలకొల్లు: జూన్, 15 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ఈ నెల 18, 19 న రెండు రోజులపాటు జరిగే నమ్మకం సభలను విజయవంతం చేయాలని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనురుల శాఖ మాత్యులు, టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు నిమ్మల రామానాయుడు పిలుపునిచ్చారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో కూటమి ముఖ్యనేతలతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈనెల 18 న పాలకొల్లు నియోజకవర్గం నమ్మకం సభ నిర్వహిస్తారని తెలిపారు. పూలపల్లి బైపాస్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి కూటమి నాయకులతో భారీ ర్యాలీ రైల్వే స్టేషన్ సెంటర్ కు, లాకులు, కెనాల్ రోడ్డు, పెద గోపురం సెంటర్, ఎడ్ల బజార్ నుంచి పెనుమదంరోడ్డు వైపు తిరిగి, అక్కడి నుంచి బ్రాడీపేట బైపాస్ రోడ్ లో ఉన్న రామచంద్ర గార్డెన్స్ వద్దకు ర్యాలీ చేరుకుంటుందని వివరించారు. అక్కడ నమ్మకం సభ నిర్వహిస్తారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ పుష్కరకాలం ప్రధానమంత్రి పదవిలో, ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం రెండేళ్ల సూపర్ పాలనకు విజయ సూచికంగా ఈ సభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. జిల్లా స్థాయిలో 19న భీమవరంలో జరిగే సభలో ముఖ్య నాయకులు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. గత ఐదేళ్ల రాక్షస పాలనకు చరమగీతం పాడి, రామరాజ్యం పై నమ్మకం ఉంచి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చిన ప్రజలకు కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందచేస్తుందని మంత్రి పేర్కొన్నారు. మోడీ ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారధ్యంలో, రాష్ట్రంలో ప్రగతిశీల పాలన పరుగులు తీస్తుందన్నారు. కూటమి పాలనపై నమ్మకంతో ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదాన్ని నిలబెట్టుకోవటానికి, కూటమి శ్రేణులు కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో, టిడిపి నాయకులు పెచ్చెట్టి బాబు, గండేటి వెంకటేశ్వరరావు, గొట్టుముక్కల సూర్యనారాయణ రాజు, మండల అధ్యక్షులు, పాముల రజిని కుమార్, మామిడి శెట్టి పెద్దిరాజు, బిజెపి నాయకులు ఉన్నమట్ల కపర్తి, జక్కంపూడి కుమార్, జనసేన నాయకులు బోనం వెంకట నరసయ్య (చినబాబు), కనకదుర్గ దేవస్థానం చైర్మన్ తులా రామలింగేశ్వరరావు, ఎలమంచిలి మండల అధ్యక్షులు కొడవటి వరబాబు తదితరులు పాల్గొన్నారు.