Telugu News Power

ఆర్యవైశ్యుల అభ్యున్నతికి కృషి చేస్తా. -జిల్లా నూతన అధ్యక్షులు తటవర్తి

తట్టవర్తిని అభినందిస్తున్న ఆర్యవైశ్య ప్రముఖులు

పాలకొల్లు: జూన్, 17( తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమగోదావరి జిల్లా ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులుగా తటవర్తి కృష్ణమూర్తి నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య సంఘం వారు ఈ మేరకు నియామక ఉత్తర్వులు అందజేశారు. వీరు ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగుతారు. గతంలో వీరు పాలకొల్లు శ్రీ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులుగా సంఘానికి ఎనలేని సేవలు అందించారు ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు తట్టవర్తి కృష్ణమూర్తి మాట్లాడుతూ, ఆర్యవైశ్యుల అభ్యున్నతికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సంఘ ఐక్యతకు పాటుపడతానని తెలిపారు. ఆర్యవైశ్య మహాసభ సభ్యత్వం పెంచటానికి ప్రయత్నం చేస్తానన్నారు. వైశ్య సంఘం తరఫున వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జిల్లాలో, అమరావతిలో ఆర్యవైశ్య భవనాల నిర్మాణానికి ఇతోతికంగా నిధులు సేకరిస్తానని ప్రకటించారు. తనపై నమ్మకం ఉంచి ఈ నియామకం చేసిన ఆర్యవైశ్య సంఘం నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో రేపాక ప్రవీణ్ భాను, మాటూరి నరసింహమూర్తి. లీలా భావన్నారాయణ, బాల రెడ్డియ్యా. భోగవిల్లి నాగభూషణం, జవ్వాజి రాజా, బంగారు బుజ్జి గుప్త, గమిని శ్రీను, సోం పండు, అన్నం గుప్తా, బాబి, నాళం బాపి రాజు, కారుమూరి శ్రీరాములు తదితరులు పాల్గొని, నూతనంగా పదవులు చేపట్టిన వారిని అభినందించారు.